జాతీయ వార్తలు

పాక్ చర్యల్ని ఖండించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఉరీలో 19మంది జవాన్ల మరణానికి కారణమైన దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ‘ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత దేశంగా మారిన పాకిస్తాన్’ తీరును తీవ్రస్థాయిలో ఖండించాలని బ్రిటన్ ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 3875 సంతకాలతో విజ్ఞప్తులు అందాయని యూకే పార్లమెంట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ సంతకాలు పదివేలు దాటితే, ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వం తప్పకుండా స్పందనను తెలియజేయాల్సి ఉంటుంది. సంతకాల సంఖ్య లక్ష దాటితే బ్రిటన్ చట్టాల ప్రకారం పార్లమెంటరీ డిబేట్ చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు. ఒసామాబిన్ లాడెన్ పాకిస్తాన్‌లో తలదాచుకోవటమే ఇందుకు ఉదాహరణ అని అందులో పేర్కొన్నారు. తక్షణం పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలని కోరారు.