జాతీయ వార్తలు

నర్సరీ అడ్మిషన్లపై ఢిల్లీలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నర్సరీ అడ్మిషన్లలో పాటించే ప్రమాణాలను ప్రకటించని పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ దేశ రాజధానిలో 9 వందలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికీ ఆ ప్రమాణాలను నోటిఫై చేయలేదు. దీంతో ఈ విషయమై గందరగోళం నెలకొంది. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి నర్సరీ అడ్మిషన్లలో పాటించే ప్రమాణాలు స్పష్టంగా ఉండాలని, వివక్షకు, అసందిగ్ధతకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా పారదర్శకతతో వీటిని రూపొందించి డిసెంబర్ 20వ తేదీ లోగా తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డిఓఇ) చాలా రోజుల క్రితమే అన్ని అన్ ఎయిడెడ్ పాఠశాలలను ఆదేశించింది. అయితే ఢిల్లీలోని 1,735 పాఠశాలలకు గాను 1,376 పాఠశాలలు ఈ గడువును పాటించకపోవడంతో వాటిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ డిఓఇ నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం డిఓఇ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికీ 918 పాఠశాలలు నర్సరీ అడ్మిషన్లకు సంబంధించిన ప్రమాణాలను ఇప్పటికీ నోటిఫై చేయలేదు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలను అయోమయానికి గురిచేయడంతో పాటు దొడ్డి దారిలో అడ్మిషన్లు జరిగేందుకు అవకాశం కల్పిస్తున్న ఈ పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్త సుమిత్ వోహ్రా విజ్ఞప్తి చేశారు.