జాతీయ వార్తలు

జవాన్ల రక్తంతో రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నరేంద్ర మోదీ ఆక్రమిత కాశ్మీర్‌లో లక్షిత దాడులు చేసిన భారత సైనికుల రక్తంతో దళారీగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు, వారి రక్తం వెనుక దాక్కున్నారు’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు కురిపించారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన నెల రోజుల కిసాన్ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపి సంజయ్ నిరుపమ్ రెండు రోజుల క్రితం ముంబయిలో విలేఖరులతో మాట్లాడుతూ భారత సైనికులు ఆక్రమిత కాశ్మీర్‌లో చేసిన మెరుపుదాడులపై అనుమానాలు వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ గురువారం ప్రధానిపై విరుచుకుపడటం గమనార్హం. సైనికుల త్యాగాలను మోదీ తనకు అనుకూలంగా వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. మన సైనికులు జమ్ముకాశ్మీర్‌లో రక్తాన్ని ప్రవహింపజేశారు. మెరుపుదాడులు చేశారు, వారి రక్తం వెనక మీరు (నరేంద్ర మోదీ) దాగి ఉన్నారు, సైనికుల రక్తంతో మీరు ‘దలాలీ’ (డబ్బు కోసం బ్రోకర్‌గా వ్యవహరించటం) చేస్తున్నారు, ఇది మంచిది కాదు’ అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. సైనికుల మెరుపుదాడులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. సైనికులు తమ పని చేస్తారు, మీరు మీ పని చేయండి, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించండి, సైనికులకు వేతనం సంఘంద్వారా ఎక్కువ వేతనాలు ఇప్పించండి, ఇది మీ బాధ్యత, మిమ్మల్ని ఇందుకే ఎన్నుకున్నారు అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ తప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలందరి చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి అందులో డబ్బు వేస్తామన్న హామీ ఏమైందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రైతులు, కార్మికులు, దుకాణాల యజమానులకు బదలు పదిహేను మంది పెద్ద వ్యాపారస్తుల ఖాతాలలోకి పెద్ద ఎత్తున డబ్బు రావటంతో నరేంద్ర మోదీ, ఆయన స్నేహితులు మాత్రమే ఆనందంగా ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 56 అంగుళాల చాతీ ఉన్న తాను అవినీతిపై పోరాటం చేస్తానని చెప్పుకున్న మోది దేశంలోని దొంగలు తమ నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకునేందుకు ఒక అందమైన పథకాన్ని అమలు చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలోని సగటు మనిషి ఖాతాలోకి డబ్బు రాలేదు కానీ బడా వ్యాపారస్తుల ఖాతాల్లోకి పోయిందంటూ రాహుల్ గాంధీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

చిత్రం.. యుపిలోని మీరట్‌లో గురువారం నిర్వహించిన ఒక రోడ్ షోలో మాట్లాడుతున్న రాహుల్