హైదరాబాద్

దసరా నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం గ్రేటర్ నగరంపై వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా సర్కారు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలతో మొత్తం రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరమే ఎక్కువగా లబ్ది పొందనుంది. సుమారు కోటి జనాభా ఉన్న నగరంలో అర్థంతరంగా ఆగిపోయిన పేదల ఇళ్లు పూర్తి చేసేందుకు హడ్కో రుణం తీసుకునేందుకు అనుకూలంగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో త్వరలో పనులు ప్రారంభం కానున్న 5వేల 50 ఇళ్లయినా తొలి దశగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్న నమ్మకం ప్రజల్లో ‘డబుల్’ అయింది. దీంతో పాటు కోటి జనాభా కల్గిన హైదరాబాద్ నగరంలోనూ బిసి, మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించాలని తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కోటి జనాభాలో దాదాపు 60 శాతం మంది మధ్య, పేద తరగతులకు చెందిన వారే ఉన్నట్లు ఓ సర్వే తేల్చింది. అయితే పిజి టు కేజి స్కీం కింద ఈ పాఠశాలను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తే, ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్న, అసలే లేని కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందేఅవకాశాలున్నాయి. ఇక దీంతో పాటు కొత్త జిల్లాలను ప్రకటించటంతో హైదరాబాద్ జిల్లాతో పాటు కొత్తగా ఏర్పడనున్న వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పౌరసేవలు మరింత సత్వరంగా సమకూరే అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలోని శివార్లలోని 12 సర్కిళ్లు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ పరిధిలోకి రావటంతో పలు పౌరసేవల నిర్వహణ కాస్త అయోమయంగా ఉండేది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను మూడు ముక్కలు చేయటంతో సేవలు మెరుగుపడుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఇదివరకు జిహెచ్‌ఎంసి పరిధిలోని పటాన్‌చెరు, మల్కాజ్‌గిరి తదితర శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు జిహెచ్‌ఎంసి మినహా ఇతర మిగిలిన ఇతర సేవల కోసం రంగారెడ్డి జిల్లా ఆఫీసులను ఆశ్రయించేవారు. కానీ కొత్త జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డి జిల్లాను సర్కారు ఎక్కడికక్కడే మూడు ముక్కలు చేయటంతో పాటు పరిపాలన, పౌరసేవల పరంగా ప్రజలకు దగ్గర్లో ఉండే ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించటంతో సేవల కోసం కిలోమీటర్ల కొద్ది ప్రయాణించే అవస్థలు తప్పుతాయని శివారు ప్రజలు భావిస్తున్నారు. ఇదే రకమైన పరిస్థితులను గ్రేటర్‌లోని ఆర్సీపురం, పటాన్‌చెరువు సర్కిళ్ల ప్రజలెదుర్కొన్నారు. వీరు జిహెచ్‌ఎంసి సేవల మినహా ఇతర సేవల కోసం మెదక్, సంగారెడ్డిలను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా కొత్త జిల్లాలను ప్రకటించటంతో ఈ సర్కిళ్ల ప్రజలు ఇకపై ఏ సేవలైనా కేవలం సంగారెడ్డిలోనే పొందే అవకాశమేర్పడుతోంది.