జాతీయ వార్తలు

అగ్రగామిగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7:అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు లభించే అత్యాధునిక రాజధానిగా అమరావతిని నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రపంచంలోని ఐదు అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా రూపొందిస్తామన్నారు. ఢిల్లీలో శుక్రవారం సిఐఐ ఏర్పాటుచేసిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పట్టణీకరణపై ఆయన ప్రసంగించారు. కొత్త రాజధానిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలు, హోటళ్లు, ఆసుపత్రులు, పర్యటనా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. తమకు రాజధాని లేకుండా రాష్ట్ర విభజన చేయటం వలన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. అయితే తానీ సంక్షోభాన్ని సదవకాశంగా మార్చుకుంటున్నానని ఆయన చెప్పారు. ‘ఎవరికైనా ఉన్న నగరాన్ని విస్తరించటం లేదా నగరం పక్కన నగరాన్ని నిర్మించే అవకాశం వస్తుంది కానీ నాకు మాత్రం ఏకంగా కొత్త రాజధానిని నిర్మించే అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటానని చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పక్కన తాను సైబరాబాద్‌ను తొమ్మిది సంవత్సరాల్లో నిర్మించానన్నారు.
‘అమరావతిని హరిత రాజధానిగా నిర్మించేందుకు మా ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. ఉన్నదంతా హైదరాబాదులో ఖర్చు పెట్టాం. ఇప్పుడు కార్యాలయాలు కూడా లేకుండానే అమరావతికి వచ్చాం. డబ్బు లేనందున అమరావతి నిర్మాణానికి లాండ్ పూలింగ్ విధానాన్ని చేపట్టాం. 34 వేల ఎకరాల భూమిని డబ్బు లేకుండా సేకరించాం. ప్రతిపక్షాలు సమస్యలు సృష్టించాయి, రైతులను రెచ్చగొట్టారు. అయినా రైతులు పట్టించుకోకుండా ముందుకు వచ్చారు. రాజకీయ పార్టీలు కోర్టుకు వెళ్లినా ఒక్క రైతు కూడా కోర్టుకు వెళ్లలేదు. రాజకీయ పక్షాలు చివరకు స్విస్ చాలెంజ్‌ను కూడా కోర్టులో సవాల్ చేస్తున్నాయి’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 60 కిలోమీటర్ల మేర నది ఉన్నందున నదికి రెండువైపులా సుందరమైన నగరాన్ని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంలో తప్పు జరిగే అవకాశాలు అతి స్వల్పమన్నారు. విశాఖపట్నం తుపాను మూలంగా నాశనమై పోయిందనీ, తానక్కడ ఏడు రోజులపాటు బస్సులోనే ఉండి సాధారణ పరిస్థితులను తీసుకురాగలిగానని, ఇప్పుడు అదే నగరం బెస్ట్ సిటీగా రూపాంతరం చెందిందని వివరించారు. ఏపిలోని ప్రతి నగరంలో ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్తును ఆదా చేస్తున్నామన్నారు. త్వరలోనే నాల్గవ పారిశ్రామిక విప్లవం రాబోతోందని చంద్రబాబు చెప్పారు. మా రాష్ట్రం జనాభా తగ్గిపోతున్నందున కుటుంబ సభ్యుల సంఖ్యను పెంచాలంటున్నానన్నారు. ప్రజల అవగాహన పెంచటం ద్వారా నగరాలను పరిశుభ్రంగా ఉండవచ్చునన్నారు. గ్రామాల్లో నాణ్యమైన వౌలిక సదుపాయాలను కల్పిస్తూ పట్టణీకరణను సాధించాలని పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలంటే ముందు ముందు తప్పు చేసే వారికి ఫైన్ విధించవలసిన అవసరం రావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

చిత్రం... సిఐఐ, డబ్ల్యుఇఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు. పక్కన నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్.