జాతీయ వార్తలు

వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ జట్టుకు సాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 28వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగే అసియా ఓషియానియా జోన్ అండర్-23 పారాలింపిక్ వీల్‌చైర్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టుకు సాయం చేయాలని ‘్ఫ్లయింగ్ సిఖ్’ మిల్కా సింగ్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. శిక్షణ నుంచి మొదలుకొని, థాయిలాండ్‌కు వెళ్లిరావడం వరకూ సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చవుతాయని 1960 రోమ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకున్న భారత మేటి అథ్లెట్ మిల్కా సింగ్ ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే, భారత జట్టులోని పారాలింపిక్ వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకాల్లో చాలా మంది దిగువ మధ్య తరగతికి చెందిన వారేనని, కాబట్టి భారీగా ఖర్చు చేయడం వారికి అసాధ్యమని వివరించాడు. పారాలింపిక్స్‌ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకే, విరివిగా విరాళాలిచ్చి, భారత జట్టును థాయిలాండ్‌కు పంపాలని కోరాడు. మొత్తం 15.20 లక్షల రూపాయలను సేకరించాలని మిల్కా సింగ్ లక్ష్యంగా ఎంచుకోగా, ఇప్పటికే సుమారు 1.20 రూపాయల విరాళాల రూపంలో అందడం విశేషం.