జాతీయ వార్తలు

లష్కరే ముష్కరులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 12: దాదాపు 60గంటల పాటు ఎడతెగని ఎదురుకాల్పులు...ఇక్కడి పాంపోర్‌లోని ఓ ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు దాదాపు మూడు రోజుల పాటు శ్రమించాయి. అంతిమంగా బుధవారం మధ్యాహ్నం ఇద్దరు ఉగ్రవాదులూ హతులైనట్టుగా ప్రకటించారు. వీరిని లష్కరే తోయిబా మిలిటెంట్లుగా గుర్తించారు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి పక్కన గల ఇడిఐ ప్రభుత్వ భవనంలోకి సోమవారం చొరబడ్డ ఉగ్రవాదుల సమాచారం అందడంతో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. బుధవారం ఆపరేషన్‌ను ముగించడానికి ముందు భవనంలోని మొత్తం 50 గదులను తనిఖీ చేశాయని ఒక సైనికాధికారి తెలిపారు. భవనం తనిఖీ దాదాపు పూర్తయిందని, ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఒక ఉగ్రవాది మంగళవారం సాయంత్రం మృతి చెందగా, మరో ఉగ్రవాదిని బుధవారం భద్రతా దళాలు కాల్చి చంపాయని ఆయన చెప్పారు. మృతి చెందిన ఉగ్రవాదులను గుర్తించాల్సి ఉందని, అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం వారిద్దరు లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద సంస్థకు చెందిన వారని ఆయన వివరించారు. సోమవారం ఉగ్రవాదులు ప్రభుత్వ భవనంలోకి చొరబడిన తరువాత వారు పారిపోకుండా ఉండేందుకు అప్పటి నుంచి భద్రతా బలగాలు ఆ భవనాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. 56 గంటల పాటు సాగిన ఆపరేషన్ వల్ల ఉగ్రవాదులు దాక్కున్న బహుళ అంతస్థుల భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. భవనంలోని అనేక గోడలు పేలిపోయాయి. ఉగ్రవాదులను ఏరివేయడానికి సైన్యంలోని సుశిక్షితులయిన పారా కమాండోలను కూడా పిలిపించినట్లు ఆ అధికారి వెల్లడించారు. ఉగ్రవాదులు తొలుత జరిపిన కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను గాయపడినట్లు ఆ అధికారి తెలిపారు. ఉగ్రవాదులు నదివైపు నుంచి ఈ భవనంలోకి ప్రవేశించి ఉండవచ్చని భావిస్తున్నామని, అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు తుది అంచనాకు రాలేదని ఆయన వివరించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా మిలిటెంట్లు ఇడిఐ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి దిగారు. అప్పుడు 48 గంటల పాటు సాగిన ఆపరేషన్ సందర్భంగా ఇద్దరు యువ సైనికాధికారులు సహా అయిదుగురు భద్రతా సిబ్బంది, ఆ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు.

చిత్రం... ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ ముగించిన సైనికులు. స్వాధీనంలోకి వచ్చిన పాంపోర్ భవనం