జాతీయ వార్తలు

వైకల్యం సంభవించినా ఉద్యోగం ఊడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సర్వీసులో ఉన్న కాలంలో అంగవైకల్యానికి గురయితే ఆ ఉద్యోగిని తొలగించడం కాని, హోదాను తగ్గించడం కాని చేయకూడదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్వీసులో ఉన్న కాలంలో అంగవైకల్యానికి గురయిన ఉద్యోగులు సర్వీసులో కొనసాగడానికి లేదా ఇన్‌వాలిడ్ పెన్షన్‌ను పొందడానికి వీలుకల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972ను సవరించింది. అంగవైకల్యం కారణంగా ఏ ఉద్యోగికీ పదోన్నతి కల్పించకుండా నిరాకరించడానికి వీలులేదని కూడా స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఇన్‌వాలిడ్ పెన్షన్‌కోసం దరఖాస్తు చేసుకుంటే, సదరు ఉద్యోగి తాను ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు మెడికల్ బోర్డ్ నుంచి సర్ట్ఫికెట్‌ను తీసుకొని సమర్పించవలసి ఉంటుందని వివరించింది.