జాతీయ వార్తలు

135 మంది క్రీడాకారులకు ఇఎస్‌ఐలో ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశవ్యాప్తంగా క్రీడల కోటాలో ఇఎస్‌ఐలో ఉద్యోగాలు పొందిన 135 మందికి నియామక పత్రాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అందజేశారు. ఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయతోపాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఎంపీ మీనాక్షి లేఖి పాల్గొన్నారు. వీరిలో ఏపి, తెలంగాణకు చెందిన 8మంది క్రీడాకారులు నియామకపత్రాలు అందుకొన్నారు. కబడ్డీ విభాగంలో నల్ల గోవర్థన్ రెడ్డి, లింగం యాదవ్, బాడ్మింటన్ విభాగంలో అరుణ్, ఆదిత్య, ఆర్చెరీలో లక్ష్మణ్, టేబుల్ టెన్నిస్‌లో బాలదుర్గ, శ్రీకాంత్, నిఖిత ఎంపికయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, ఉద్యోగులుగా ఎంపికైన 135 మందిని వచ్చే ఒలింపిక్స్‌కు పంపించడానికి సన్నద్ధం చేస్తామన్నారు. వీరికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. క్రీడాకారులు తమ శాఖలో భాగస్వామ్యం అయినందుకు గర్యకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు ఓపిక అవసరమని, ఎన్నిసార్లు ఓడిపోయినా గెలుస్తామనే నమ్మకంతో ముందుకు సాగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.

చిత్రం.. క్రీడాకారులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న దత్తాత్రేయ