జాతీయ వార్తలు

బాలల హక్కులు తిరుగులేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఎంత ఘోరమైన నేరాలకు పాల్పడినప్పటికీ బాలల హక్కుల విషయంలో ఏమాత్రం రాజీ పడడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక హత్య కేసు విషయంలో సెషన్స్ కోర్టు వ్యవహరించిన తీరు పట్ల, కోర్టు ఉదాసీనత కారణంగా ఒక బాల నేరస్థుడు తొమ్మిదేళ్లపాటు జైల్లో గడపాల్సి రావడంపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాల నేరస్థులకు (జువనైల్స్) సంబంధించిన చట్టం విషయంలో కింది కోర్టుల జడ్జీలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడుతూ ఈ కేసు విషయంలో సెషన్స్ కోర్టు వ్యవహరించిన తీరు కారణంగా జువనైల్ జస్టిస్ చట్టం కింద ఒక మైనర్‌కు లభించాల్సిన విలువైన హక్కులు పూర్తిగా మృగ్యమైపోయాయని వ్యాఖ్యానించింది. బాలుడ్ని తక్షణం విడుదల చేయాలని న్యాయమూర్తులు గీతా మిట్టల్, పిఎస్ తేజిలతో కూడిన బెంచ్ ఆదేశిస్తూ, జువనైల్ జస్టిస్‌పైన పునశ్చరణ తరగతులు నిర్వహించడానికి, దానికి సంబంధించి పాఠ్య ప్రణాళికను రూపొందించడం కోసం తమ తీర్పు కాపీని ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌కు పంపించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లలో పునశ్చరణ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఈ ప్రణాళిక కాపీని ప్రతి జిల్లా జడ్జికి పంపించాలని కూడా బెంచ్ పేర్కొంది.
2007 జనవరి 13న ఈ బాలుడ్ని అరెస్టు చేశారని, అప్పటినుంచి అతను జైల్లోనే ఉన్నాడనే విషయాన్ని బెంచ్ గుర్తు చేసింది. అతను తొమ్మిదేళ్లపాటు జైల్లో ఉన్నాడని, జువనైల్ జస్టిస్ చట్టం కింద అనుమతించిన గరిష్ఠ శిక్షకన్నా ఇది ఎక్కువేనని బెంచ్ స్పష్టం చేసింది. బాలుడి వయసును నిర్ధారించే విషయంలో పోలీసుల ఉదాసీనతకు సైతం ఇది అద్దం పడుతుందని, ఎందుకంటే హత్య కేసులో ఆ బాలుడికి 2014లో జీవిత ఖైదు విధించారని బెంచ్ పేర్కొంది. నేరం జరిగిన సమయంలో ఆ బాలుడు మైనరని న్యాయస్థానం పేర్కొంటూ, ఒకవేళ అతను ఎంతటి దారుణమైన నేరానికి పాల్పడినప్పటికీ బాలల హక్కుల విషయంలో రాజీ పడటానికి వీలులేదని స్పష్టం చేసింది.