జాతీయ వార్తలు

యూపీలో కమల వికాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ హవా కొనసాగుతుందని ఇండియాటుడే-యాక్సిస్ ముందస్తు ఎన్నికల సర్వే అంచనా వేసింది. 403 స్థానాలున్న యూపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 170 నుంచి 183 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొంది. అంటే సాధారణ మెజారిటీకి 19 నుంచి 29 స్థానాలు మాత్రమే తక్కువ అవుతాయి. ఇక అధికారం కోసం అర్రులు చాస్తున్న మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీకి 115నుంచి 124 స్థానాలు రావచ్చని ఈ ఎన్నికల సర్వేలో పేర్కొంది. ఇక అధికారంలో ఉన్న సమాజ్ వాది పార్టీ 94-103 స్థానాల మధ్య పరిమితమవుతుందని అంచనా వేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించి స్టార్ ప్రచారకర్త రాహుల్‌గాంధీ కిసాన్ యాత్రలతో ముందుగానే ప్రచార హోరెత్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండంకెలు దాటడం కష్టమేనని సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాయావతికి 31శాతం మంది అనుకూలంగా స్పందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పట్ల 27శాతం మంది, కేంద్ర హోం మంత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు 18శాతం మంది అనుకూలత వ్యక్తం చేశారు. 27సంవత్సరాల క్రితం అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచార కార్యకర్తగా భావిస్తున్న ప్రియాంకాగాంధీకి కేవలం రెండుశాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నామని చెప్పారు. ఇక ఆ పార్టీ సిఎం అభ్యర్థి అయిన షీలాదీక్షిత్‌కు ఒకే ఒక్క శాతంమంది సానుకూలత వ్యక్తం చేశారు. విచిత్రమేమంటే వివాదాస్పద బిజెపి నేత యోగి ఆదిత్యనాథ్‌కు 14శాతం మంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓటేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి యుపిలో మంచి ఓట్లే పడ్డాయి. పార్టీకి పునర్వైభవం తీసుకురాగలిగేది రాహులేనని ఎక్కువమంది ఓటర్లు అభిప్రాయ పడ్డారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండా అవుతుందని మెజార్టీ అభిప్రాయం. అయోధ్య, గోరక్షణ వంటి అంశాలు అప్రధానమవుతాయనే ఓటర్లు అన్నారు.