జాతీయ వార్తలు

లంచం ఇస్తే శౌర్య పతకం వెతుకుతాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఆమె కుమారుడు సైన్యంలో కెప్టెన్. ఆపరేషన్ రక్షక్‌లో అసువులు బాశాడు. అతని మరణానంతరం కేంద్రం శౌర్యచక్రను, జమ్మూ ప్రభుత్వం సాహస అవార్డును ప్రకటించాయి. అయితే, అవి చోరీకి గురికావడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు తిరిగినా పోలీసులు స్పందించలేదనీ, వాటిని వెతికిపెట్టాలంటే లంచం డిమాండ్ చేశారని ఆమె వాపోయింది. నిర్మాలా శర్మ కుమారుడు దేవశీష్ శర్మ 1994 డిసెంబర్ 10న జరిగిన ఆపరేషన్ రక్షక్‌లో అమరుడయ్యాడు. అతని ధైర్యసాహసాలకు గుర్తింపుగా కేంద్రం కీర్తిచక్రను, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సాహస అవార్డును బహూకరించాయి. అయితే 2014 అక్టోబర్ 21న నిర్మలాశర్మ ఇల్లు చోరీకి గురికావడంతో ఈ పతకాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. చోరీకి సంబంధించి షాపురా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, వాటిని వెతకాలంటే లంచం ఇవ్వాలని కొంతమంది పోలీసు అధికారులు డిమాండ్ చేశారని, అయితే తాను తిరస్కరించానని నిర్మలా శర్మ విలేఖరులకు తెలిపారు. ప్రభుత్వాలు బహూకరించిన అసలు పతకాలు ఇవ్వలేకపోయినా, కనీసం వాటి నమూనాలు ఇచ్చినా తనకు సంతోషమేనని అన్నారు. అవి తన కుమారుడి ధైర్యసాహసాలకు ప్రతీకలనీ, జ్ఞాపకాలుగా భద్రపరుచుకోవడమే తన ఉద్దేశమని నిర్మలాశర్మ పేర్కొన్నారు. అయితే, ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తనకు ఆహ్వానం వచ్చిందని, ఆయన్ను కలిసే అవకాశమొస్తే ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకువెళతానని నిర్మలా శర్మ ఓ న్యూస్‌చానల్‌కు చెప్పినట్లు తెలిసింది. కాగా, నిర్మలా శర్మ నివాసాన్ని మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్రసింగ్ సందర్శించి, కేసు పునర్విచారణ జరిపేందుకు హామీ ఇచ్చినట్లు ఆ చానెల్ ప్రసారం చేసింది.