జాతీయ వార్తలు

సహనశీలతకు నిలయం భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత దేశాన్ని సహనశీలతకు విశ్వవిద్యాలయంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనివర్ణిస్తూ, దేశంలో మత హింసను ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించబోమని స్పష్టం చేశారు.‘శాంతియుత సహజీవనానికి సహన శీలత ముఖ్యం. భారత దేశంలో అన్ని మతాలకు చెందిన వారు వివక్ష భయం లేకుండా శాంతియుతంగా జీవించడమే కాకుండా తమ మతాలను అచరిస్తున్నారు. అందుకే భారత దేశం సహనశీలత విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చు’ అని శుక్రవారం ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఇక్కడ ఏర్పాటు చేసిన క్రైస్తవ మత పెద్దల సమావేశంలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ అన్నారు. దాదాపు 2వేల సంవత్సరాలక్రితమే క్రైస్తవమతం భారత దేశానికి వచ్చిందని, ప్రపంచంలోని అత్యంత పురాతన చర్చిల్లో ఒకటైన సెయింట్ థామస్ చర్చి కేరళలో ఉందని ఆయన అన్నారు. సెయింట్ థామస్ మొదలుకొని మదర్ థెరిసా దాకా క్రైస్తవులు అందించిన సేవలను భారత దేశం మరిచిపోదని, సమాజంలోని రుగ్మతలను పారద్రోలడానికి వారు ప్రయత్నించారని రాజ్‌నాథ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో చర్చిలపై దాడుల సంఘటనలు జరిగాయని ఆయన అంటూ, అయితే ఎన్నికలకు ముందు కాని, తర్వాత కానీ భారత దేశంలో మతపరమైన దాడులను ఎన్నడూ అనుమతించబోమని చెప్పారు. పాకిస్తాన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన ఆయన దేశ విభజన జరిగినప్పుడు భారత్ లౌకిక రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకోగా, పాకిస్తాన్ మాత్రం మతపరమైన దేశంగా ఉండాలని నిర్ణయించుకుందని, ఇప్పుడు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా చేసుకుందని అన్నారు. ‘కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా చేసుకోవడం దురదృష్టకరం. ప్రజల మధ్య విభేదాలు ఉండవచ్చు. వాటిని తుపాకుల ద్వారా కాక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు’ అని రాజ్‌నాథ్ అంటూ, టెర్రరిస్టుకు కులం, మతం, తెగ లేవని అన్నారు. బిజెపి ఎంపి, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఉదిత్ రాజ్, గుడ్ షెపర్డ్ చర్చ్ బిషప్, అఖిల నారత క్రిస్టియన్ కౌన్సిల్ చైర్మన్ జోసెఫ్ డిసౌజా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిసౌజాక్రైస్తవులకు పిలుపునిచ్చారు. కాగా, క్రైస్తవులకు, వారి ప్రార్థనాస్థలాలకు రక్షణ కల్పించాలని రాష్ట్రప్రభుత్వాలకు, పోలీసులకు ఒక సర్క్యులర్‌ను పంపించాలని క్రిస్టియన్ కౌన్సిల్ రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేసింది.