జాతీయ వార్తలు

కలాం స్మారక స్థూపానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామేశ్వరం, అక్టోబర్ 15: దివంగత మాజీ రాష్టప్రతి, ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ అబ్దుల్ కలాం స్మారక స్థూపానికి ఆయన స్వస్థలమైన రామేశ్వరం సమీపంలోని పీకారుంబు వద్ద శంకుస్థాపన జరిగింది. శనివారం కలాం 85వ జయంతి సందర్భంగా ఆయన సోదరుడు ముత్తుమీరన్ మరైకయర్ ఈ స్మారక స్థూపానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, కలాం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం పికె సింగ్ నేతృత్వంలో డిఆర్‌డిఓకు చెందిన బృందమొకటి ఈ ప్రాంతాన్ని సందర్శించి స్మారకస్థూపానికి సంబంధించిన వివిధ అంశాలపై స్థానిక అధికారులతో చర్చించింది. మొత్తం 50 కోట్ల వ్యయంతో స్మారకస్థూపం, నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం చేస్తారు. మొదటి దశలో 15 కోట్ల వ్యయంతో సుమారు 27 వేల చదరపు అడుగుల ప్రాంతంలో స్మారక స్థూపం, కలాం విగ్రహాన్ని నిర్మిస్తారు. కలాం రెండవ వర్ధంతి రోజయిన వచ్చే ఏడాది జూలై 27 నాటికల్లా ఈ స్మారకస్థూపం సిద్ధమవుతుంది. రెండో దశలో నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం చేపడతారని డిఆర్‌డిఓ అధికారుల బృందం తెలిపింది.
రాష్టప్రతి, ప్రధాని నివాళి
కలాం 86వ జయంతి సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అయనకు ఘనంగా నివాళులర్పించారు. రాష్టప్రతి అపణబ్‌తో పాటుగా రాష్టప్రతి భవన్ సిబ్బంది కలాంకు ఘనంగా నివాళులర్పించినట్లు రాష్టప్రతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి భారతీయుడికీ ఆదర్శమూర్తి కలాం అని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు.
chitram...
కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ 3, 4 యూనిట్ల నిర్మాణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో ప్లాంట్ సైట్ డైరెక్టర్ ఆర్.ఎస్.సుందర్