జాతీయ వార్తలు

మృత్యు వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందౌలి (యూపీ), అక్టోబర్ 15: ఇరుకైన వంతెన... వేలాదిగా తరలివచ్చిన భక్తులు... ఇంతలోనే వంతెన కూలిపోయిందన్న వదంతులు... ఎవరికి వారు ప్రాణాలు దక్కించుకునేందుకు తోపులాట... ఇంకేముంది... తొక్కిసలాట మొదలైంది. ఫలితం... ఇరవై నాలుగు మంది భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయ... ఎంతో ప్రశాంతతకు నిలయమైన ఆ ప్రాంతం శ్మశాన వాటికను తలపించింది. చిందరవందరగా పడిన వస్తువులు, చెప్పులు... ఆ మధ్యలో మృతదేహాలు... ఆప్తులను కోల్పోయిన వారి రోదనలో ఆ ప్రాంతం నిండిపోయింది. ప్రభుత్వాలకు ముందుచూపులేకపోవడంతో ఇలాగే విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా వారణాసిలో ఆధ్యాత్మిక గురువు జై గురుదేవ్ జయంతి సభకు వెళ్తూ తొక్కిసలాటలో ఇరవై మందికి పైగా భక్తులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో 15 మంది మహిళలే ఉన్నారు. వారణాసి-చందౌలీ మార్గంలోని రాజ్‌ఘాట్ వంతెన ఇప్పుడు జరిగిన విషాదానికి వౌన సాక్షిగా నిలిచింది. ఒకేసారి వేలాది మంది వంతెన దాటాలన్న ప్రయత్నమే ప్రమాదానికి కారణమని అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకున్నప్పటికీ నిర్వాహకులు అంతమందిని సమీకరించడవల్లే ఇరుకైన వంతెనపై ఇంత దారుణం జరిగిపోయిందిన వారు చెప్పారు. బాబా జైగురుదేవ్ 2012లో కన్నుమూశారు. ఆయనకు వేలాది మంది భక్తులు ఉన్నారు. ఆయన చనిపోయేనాటికి 116 ఏళ్లని భక్తులు విశ్వాసం. ఏటా బాబా జయంతికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. శనివారం అలాగే తరలిరాగా, అపశ్రుతి చోటుచేసుకుంది.
పోలీసుల వైఫల్యమే!
వేలాదిగా తరలివచ్చిన భక్తులను క్రమబద్ధం చేయాల్సిన పోలీసులు వెనక్కునెట్టేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో తన తల్లిని కోల్పోయానని ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని మరోసాక్షి తెలిపాడు. వేలాది మంది వస్తారని తెలిసినా అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు లేవని ఆయన తప్పుపట్టారు. ముందుగా ఒక వ్యక్తి ఊపిరాడక చనిపోయాడని స్థానిక అధికారులు వెల్లడించారు. అప్పటికే భక్తులు వేలాదిగా వంతెనపైకి రావడం. బరువుకు అది కూలిపోయిందన్న వదంతులు తొక్కిసలాటకు కారణమైందని వారన్నారు. నిర్వాహకులు, పోలీసులు వైఫల్యం వల్లే విలువైన ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని బంధువులు ఆరోపించారు.
కాగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవడం లేదు. 2013 అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్‌లో జరిగిన తొక్కిసలాటలో 110 మంది మృతి చెందారు. మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదనడానికి రాజ్‌ఘాట్ వంతెనపై జరిగిన ఘటనే ఉదాహరణ. బాధితులకు నష్టపరిహారం అందించి చేతులుదులుపేసుకోవడమే తప్ప జనాన్ని క్రమబద్ధం చేయడానికి ఎలాంటి శాస్ర్తియ పద్ధతి లేదని ఆరోపిస్తున్నారు.
chitram...
భక్తులతో కిటకిటలాడుతున్న వారణాసి-చందౌలీ మార్గంలోని రాజ్‌ఘాట్ వంతెన. తొక్కిసలాటి జరిగింది ఈ వంతెన మీదే