జాతీయ వార్తలు

పాకిస్తాన్ పనే అది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, అక్టోబర్ 17: పాకిస్తాన్ యంత్రాంగం అంతా భారత్‌లో ఉగ్రవాదాన్ని రగుల్కొల్పడానికి కృషి చేస్తోందని, అందువల్ల భారత్-పాక్ సరిహద్దుల నిర్వహణ పెద్దసవాలుగా మారిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే పాములను పెంచి పోషిస్తున్న వారు అవి తమనూ కరుస్తాయని గ్రహించాలని ఆయన పరోక్షంగా ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా ఉన్న పాకిస్తాన్‌ను హెచ్చరించారు. గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సృష్టించి, పెంచి పోషిస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మరుసటి రోజే రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. రెండు రోజులపాటు ఇక్కడ జరుగుతున్న ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ సంపాదకుల సదస్సును ఉద్దేశించి ఆయన సోమవారం మాట్లాడుతూ ‘ఉగ్రవాదాన్ని తన విధానంగా స్వీకరించిన పాకిస్తాన్ దక్షిణాసియాలోనే కాకుండా అంతర్జాతీయ సమాజంలోనూ ఏకాకి అయింది’ అని అన్నారు.
పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి మాత్రమే భారత్ వ్యతిరేకమని, పాకిస్తాన్ ప్రజలకు కాదని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో నడుస్తున్న ఉగ్రవాదుల తయారీ కర్మాగారాలను మూసివేయాలని సాగే ఉగ్రవాద వ్యతిరేక ప్రచారానికి భారత్ సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘్భరత్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. పిఒకెలో ఉగ్రవాద వ్యతిరేక ప్రచారం నిర్వహించడానికి పాకిస్తాన్‌కు భారత్ సహకరిస్తుంది. పాకిస్తాన్ కావాలనుకుంటే మన సహాయం తీసుకోవచ్చు. భారత్ సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రపంచ సమాజంలో ఏ దేశం మద్దతయినా తీసుకోవచ్చు. కాని, పాకిస్తాన్ మనోగతమే స్పష్టంగా లేదు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కర్మాగారాలను మూసివేస్తే దక్షిణాసియాలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయని, తద్వారా అభివృద్ధి, సుసంపన్నతకు మార్గాలు తెరచుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల పట్ల పాక్ అనుసరిస్తున్న మెతక ధోరణియే ఇరు దేశాల మధ్య సంబంధాలకు పెద్ద ప్రతిబంధకంగా తయారయిందని రాజ్‌నాథ్ వివరించారు. మొత్తంగా ఈ ప్రాంతం నుంచే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని భారత్ కోరుకుంటోందని తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాక్ చేసిన రాజ్య, రాజ్యేతర శక్తుల వాదనలో పసలేదని తేలిపోయిందని అన్నారు. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారయిందంటే చివరకు స్వాతంత్య్ర సమర యోధుడికి, ఉగ్రవాదికి మధ్య తేడా తెలియనంత స్థాయికి చేరిందని రాజ్‌నాథ్ విమర్శించారు.

చిత్రం... చండీగఢ్‌లో సోమవారం ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ సంపాదకుల సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎన్నికల తరువాతే సిఎం అభ్యర్థి నిర్ణయం
బిజెపి యుపి అధ్యక్షుడు వౌర్య
బరేలి/బడౌన్ (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 17: మరికొద్ది నెలల్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ వౌర్య తెలిపారు. సోమవారం ఆయన బరేలిలో విలేఖరులతో మాట్లాడుతూ ‘అన్ని రాజకీయ పార్టీలు బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థికోసం వేచిచూస్తున్నాయి. అయితే ఎవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఎన్నికలలో పోటీ చేయాలనేది మా పార్టీ స్పష్టమైన విధానం’ అని అన్నారు.
‘బిజెపి అస్సాం, ఢిల్లీ ఎన్నికలలో ముందే సిఎం అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో అస్సాంలో గెలవగా, ఢిల్లీలో ఓడిపోయాం. హర్యానా, జార్ఖండ్‌లలో ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాం’ అని వౌర్య అన్నారు. 403 సీట్లు గల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బిజెపి 300 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, తరువాత పార్టీ పార్లమెంటరీ బోర్డు ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. అంతకుముందు వౌర్య బడౌన్‌లో మాట్లాడుతూ బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మత నాయకులను కించపరుస్తున్న మాయావతికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.