జాతీయ వార్తలు

రోజుకు 2వేల క్యూసెక్కులు ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ తమిళనాడుకు రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున కావేరీ జలాలను విడుదల చేయాలని కర్నాటకను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ అంశంపై ఎలాంటి వివాదాలను రెచ్చగొట్టుకోకుండా శాంతి, సామరస్యాలను పాటించాలని రెండు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవాభిమానాలతో మనుగడ సాగించాలని, దేశ పౌరులుగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని జస్టీస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచి ఉద్ఘాటించింది. కావేరీ జలాల ట్రిబ్యునల్ 2013లో చేసిన కేటాయింపులను సవాలు చేస్తూ కర్నాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాలు జారీ చేసిన పిటిషన్లు చెల్లుతాయా లేదా అన్న అంశాన్ని తేల్చిన తర్వాతే కావేరీ పర్యవేక్షక కమిటీపై వాదోపదావాలను వింటామని స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాలు దాఖలు చేసిన అప్పీళ్లు రాజ్యాంగంలోని 131, 262 అధికరణలు, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార చట్టం ప్రకారం ఎంత మాత్రం చెల్లవని అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ కోర్టుకు నివేదించారు. రాజ్యాంగం ప్రకారం ట్రిబ్యునల్ జారీ చేసే డిక్రీ సుప్రీం కోర్టు ఆదేశంతో సమానమని పేర్కొన్న ఆయన ‘తన సొంత తీర్పులపైనే అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారించజాలదు’అని పేర్కొన్నారు.