జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాక్ రద్దుకు సిపిఎం మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయాలన్న ముస్లిం మహిళల డిమాండ్‌కు సిపిఎం మద్దతు ప్రకటించింది. ట్రిపుల్ తలాక్ ఏకపక్షమే కాకుండా అనాలోచితమని, దాన్ని రద్దుచేయాలన్న ముస్లిం మహిళలకు మద్దతు తెలుపుతున్నామని సిపిఎం పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. చాలా ఇస్లామిక్ దేశాలు దీన్ని అమలు చేయటం లేదని, ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలన్న డిమాండ్‌ను ఆమోదిస్తే ఎందరో ముస్లిం మహిళలకు ఉపశమనం కలుగుతుందని పార్టీ అభిప్రాయపడింది. దేశంలోని అన్ని మతాలు, వర్గాల మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సిపిఎం ఆరోపించింది. దత్తత, ఆస్తి హక్కులు, జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయాల్లో హిందూ మహిళలు వివక్షకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.