జాతీయ వార్తలు

సిగ్గుపడుతున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లూధియానా, అక్టోబర్ 18: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇప్పటికీ దళితులపై దాడులు జరగడాన్ని చూసి సిగ్గుపడుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదనతో అన్నారు. ఈ దారుణాలను ఇంకెంత మాత్రం ఉపేక్షించకూడదని, ఈ ఘోరాలకు దారితీస్తున్న సామాజిక ప్రతికూల పరిస్థితుల్ని సరిదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు జరగాల్సిందేనని పిలుపునిచ్చారు. మంగళవారం నాడిక్కడ జాతీయ ఎస్‌సి, ఎస్‌టి హబ్ ప్రారంభం సందర్భంగా మాట్లాడిన మోదీ కులతత్వం, అంటరానితనానికి వ్యతిరేకంగా గళం విప్పిన గురు గోవింద్ సింగ్‌ను ఉటంకించారు. సామాజికంగా పేరుకుపోయిన కొన్ని లోపాల కారణంగానే ఇప్పటికీ దళిత సోదరులపై దాడులు జరుగుతున్నాయని..వీటిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నానని తెలిపారు. ఇలాంటి విపరిణామాలకు ఆస్కారం ఇవ్వని విధంగా సామాజికంగా దిద్దుబాటు చర్యలు చేపడతామన్నారు. దేశంలో ఇతర యువకుల కంటే దళిత, ఆదివాసి యువకుల ఆశలు, ఆకాంక్షలు ఎంత మాత్రం తక్కువ కాదన్నారు. సరైన అవకాశం లభిస్తే ఇతరులకు ఎంత మాత్రం తీసిపోకుండా పోటీపడగలుగుతారని చెప్పారు. దళితులు, ఆదివాసీలు ఇతరులకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఈ జాతీయ హబ్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల కింద ఎస్‌సి, ఎస్‌టిలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని
తెలిపారు. ఈ వర్గాలకు చెందిన కనీసం ఓ మహిళ, పురుషుడికి కోటి రూపాయల వరకూ రుణాలు ఇవ్వాలని జాతీయ బ్యాంకులను ఆదేశించడం జరిగిందన్నారు. దీని వల్ల ఈ వర్గాల నుంచి దాదాపు నాలుగు లక్షల మంది పారిశ్రామిక వేత్తలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దళితులను ప్రోత్సహించడానికి వీలుగా వారు ఉత్పత్తుల్లో నాలుగు శాతం మేర కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించడం జరిగిందన్నారు. 490 కోట్ల రూపాయల ప్రారంభ మూలధనంతో జాతీయ ఎస్‌సి, ఎస్‌టి హబ్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.

చిత్రం.. పంజాబ్ పర్యటనలో భాగంగా మహిళలకు రాట్నాల పంపిణీ కార్యక్రమంలో నూలు వడుకుతున్న ప్రధాని నరేంద్ర మోదీ