జాతీయ వార్తలు

ఆంధ్రలోనే మన్నవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,అక్టోబర్ 19: జనరేటర్లు, బాయిలర్లు, టర్బైన్లను ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన మన్నవరం ప్రాజెక్టును తరలిస్తున్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఖండించారు. మన్నవరం ప్రాజెక్టు అక్కడే ఉంటుందని ఆయన బుధవారం విలేఖరులకు చెప్పారు. వెంకయ్యనాయుడు ఈరోజు కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గీతేలతో సమావేశమై మన్నవరం తదితర ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించారు. ఎన్‌టిపిసి, బీహెచ్‌ఇఎల్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కొందరు వ్యక్తులు రాజకీయ కారణాలతో మన్నవరం ప్రాజెక్టు తరలిపోతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకయ్య విమర్శించారు. మన్నవరం ప్రాజెక్టు అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయితే ఈ ఇబ్బందులను అధిగమిస్తామనే భరోసాను ఆయన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయని వెంకయ్యనాయుడు చెప్పారు. మన్నవరం ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే వార్తలు తన దృష్టికి రాగానే మంత్రులు, సంబంధిత అధికారులతో చర్చించినట్లు ఆయన చెప్పారు. మన్నవరం ప్రాజెక్టు అధికారులు కూడా వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు, ఉత్పత్తి ఒక కోటి రూపాయలకు మించటం లేదని అధికారులు చెప్పారన్నారు.
నాలుగు వేల మెగావాట్ల పూడిమడక సూపర్ థర్మల్ కేంద్రం విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించటం గురించి చర్చించామన్నారు. ఈ సూపర్ థర్మల్ కేంద్రానికి బొగ్గు లింకేజీ కల్పించేందుకు మంత్రి అంగీకరించారని వెంకయ్యనాయుడు వెల్లడించారు. అనంతపురం జిల్లా కదిరిలో ప్రస్తుతం ఉన్న వెయ్యి మెగావాట్ల విద్యుత్ కేంద్రం వద్ద 125 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన టెండర్లు గురువారం చేపడుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తిరుపతి రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాన్ని స్మార్ట్ సిటీ పద్ధతిలో అభివృద్ధి చేస్తారని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలోని పది పట్టణాలలోని రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాలను స్మార్ట్‌సిటీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల మధ్య బుధవారం ఒక ఓప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.