జాతీయ వార్తలు

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తనతో సహా ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం పిటిషన్‌పై ట్రయల్ కోర్టులో విచారణను నిలిపివేయించాలని అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. పిటిషనర్ చేసిన అభ్యర్థన లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. ‘చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సిఎంఎం) ముందు ఉన్న విచారణను నిలిపివేయించాలని పిటిషనర్ చేసిన అభ్యర్థనను తిరస్కరించడమైనది. ఎలాంటి పసలేని కారణంగా పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చడం జరిగింది’ అని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ తేజి పేర్కొన్నారు. సిఎంఎం ముందున్న నేర విచారణను కొనసాగించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని నిరూపించడానికి అవసరమైన ఆధారాలను పిటిషనర్ ఈ కోర్టుకు సమర్పించలేక పోయారని న్యాయమూర్తి అన్నారు. అందువల్ల నేర విచారణను కొనసాగించాలని సిఎంఎం 2016 మే 19న జారీ చేసిన ఆదేశాలలో ఎలాంటి చట్టవ్యతిరేకత, వికట స్వభావం లేదని ఈ కోర్టు అభిప్రాయపడిందని జస్టిస్ తేజి తన తీర్పులో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు జూలై 25న ప్రకటించింది.

కుప్పకూలిన హెలీకాప్టర్
15 మంది సురక్షితం
డెహ్రాడూన్, అక్టోబర్ 19: ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 15 మంది ఉద్యోగులకు బుధవారం ఇక్కడ త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. సిబ్బంది ప్రయాణిస్తున్న భారత వైమానిక దళం హెలీకాప్టర్ ఉత్తరాఖంఢ్‌లోని మనా గ్రామంలో కూలిపోయింది. చమోలీ జిల్లాలో ఉదయం 9.25 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఐ-17 వి5 హెలీకాప్టర్ రోజువారీ శిక్షణలో భాగంగా ఘస్టోలీ హెలీప్యాడ్- బద్రీనాథ్ మధ్య వెళ్తోంది. హెలీకాప్టర్‌లో సాంకేతి సమస్యల తలెత్తడంతో కూలిపోయిందని వైమానిక అధికారులు వెల్లడించారు. అందులో ప్రయాణిస్తున్న 15 మంది సురక్షితంగా బయటపడ్డారని వారన్నారు. ఈ ప్రమాదంపై కల్నల్ ర్యాంకు అధికారితరో విచారణ జరిపిస్తున్నారు.
ఎల్‌ఓసి వద్ద సంఘ్
కార్యకర్తలను పెట్టుకోండి
లక్నో, అక్టోబర్ 19: జమ్మూకాశ్మీర్‌లోని ఎల్‌ఓసి వద్ద జరిగిన సర్జికల్ దాడికి ఆర్‌ఎస్‌ఎస్ పాఠాలే ప్రేరణగా నిలిచాయన్న రక్షణ మంత్రి పారికర్ వ్యాఖ్యలపై తీవ్రంగా కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడుతున్న రక్షణ మంత్రి అలాంటప్పుడు ఎల్‌ఓసి వద్ద జావాన్లు ఎందుకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలనే నియమించుకోచ్చుకదా?అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. సరిహద్దుల్లో జవాన్ల స్థానే సంఘ్ కార్యకర్తలను నియమించుకోవాలని లక్నో కాంగ్రెస్ పరిశీలకుడు హుసైసీ దల్వీ సలహా ఇచ్చారు. సైనికులకంటే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే సమర్ధులని మంత్రి భావిస్తే వారి సేవలే ఉపయోగించుకోవడం మంచిదని ఆయన అన్నారు. దేశంలో విచ్ఛిన్నకర కార్యక్రమాలను ఆర్‌ఎస్‌ఎస్ ప్రోత్సహిస్తోందని, దానికి కేంద్రం వత్తాసు పలుకుతోందని కాంగ్రెస్ విరుచుకుపడింది. తన వైఫల్యాను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని పారికర్‌ను ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందన్న ధీమా దల్వీ వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటులో తామే కీలక పాత్ర పోషిస్తామని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కిసాన్ యాత్ర కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపిందని ఆయన అభిప్రాయపడ్డారు.