జాతీయ వార్తలు

బాధ్యులను వదలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, అక్టోబర్ 19: భువనేశ్వర్ సమ్ ఆసుపత్రి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా బుధవారం స్పష్టం చేస్తూ, ఈ తీవ్రమైన తప్పిదానికి బాధ్యులైన వారినందరిపైనా చర్యలు తీసుకునేలా చూడాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేస్తుందని నగరంలో ఒక రోజు పర్యటనను ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళ్లే ముందు విలేఖరులతో మాట్లాడుతూ నడ్డా చెప్పారు. భువనేశ్వర్‌లోని సమ్ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం సంభవించిన అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చాలా బాధాకరమైనదే కాకుండా ఆందోళన కలిగించే సంఘటన అని, సమ్ ఆస్పత్రిలో సేఫ్టీకి సంబంధించి కొన్ని లోపాలు తన దృష్టికి వచ్చాయని ఆయన అంటూ, వీటిని సరిదిద్దాల్సిన అవసరముందని అగ్నిప్రమాదం సంభవించిన ఆస్పత్రిని సందర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నడ్డా అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన అవసరముందని ఆయన అంటూ, అది జరగాలంటే ఈ సంఘటనకు బాధ్యులైన వారినందరినీ శిక్షించాలని అన్నారు. అదే సమయంలో ప్రోటోకాల్‌ను, మార్గదర్శకాలను పాటించాలని కూడా ఆయన అన్నారు.కాగా, అగ్నిప్రమాదం తర్వా త సమ్ ఆస్పత్రినుంచి తరలించిన పేషంట్లు చికిత్స పొందుతున్న నగరంలోని వివిధ ఆస్పత్రులను సందర్శించిన నడ్డా రోగుల పరిస్థితిని, అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే సమ్ ఆస్పత్రిలోని ఐసియు, డయాలసిస్ విభాగాలలో చికిత్స పొందుతున్న వందమందికి పైగా రోగులను నగరంలోని ఎయిమ్స్, క్యాపిటల్ హాస్పిటల్, ఎఎంఆర్‌ఐ, కిమ్స్ ఆస్పత్రులకు తరలించిన విషయం తెలిసిందే. ఈ రోగుల చికిత్సకు సంబంధించి రాష్ట్ర వైద్య అధికారులతో చర్చించిన నడ్డా రోగుల చికిత్స విషయంలో ఒడిశా ప్రభుత్వానికి కేంద్రంవైపునుంచి అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. తప్పులను ఎంచడం కోసం తాను ఇక్కడికి రాలేదని, అగ్నిప్రమాదంలో గాయపడిన రోగులకు సరయిన చికిత్స అందేలా చూడడానికే తమ తొలి ప్రాధాన్యత అని నడ్డా చెప్పారు. ఉదయం పది గంటలకు వచ్చిన వెంటనే నడ్డా కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలకు చెందిన వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నడ్డా వెంట కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు.
ఒడిశా సర్కార్‌కు
ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు
ఇదిలా ఉండగా, ఒడిశాలోని మొత్తం 568 ఆస్పత్రుల్లో మూడు ఆస్పత్రుల్లో మాత్రమే అగ్నిప్రమాదాల సేఫ్టీకి సంబంధించిన నిబంధనలను పాటించడం జరిగిందని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. భువనేశ్వర్‌లోని సమ్ ఆస్పత్రిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోగా, వందమందికి పైగా గాయపడినట్లు మీడియాలో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి ఈ సంఘటనపై ఒడిశా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి నొటీసులు జారీ చేయడమే కాకుండా ఆరువారాల్లోగా మృతుల కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి అందించిన సహాయ పునరావాస చర్యలతో పాటుగా ఈ సంఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సరయిన అనుమతులు లేకుండా ఇంత భారీ సంఖ్యలో ఆస్పత్రులు పని చేయడానికి ఎలా అనుమతిస్తున్నారని కమిషన్ ఆశ్చ ర్యం వ్యక్తం చేసింది. అగ్నిప్రమాదం జరిన ఆస్పత్రిలో సరయిన ఫైర్ సేఫ్టీ చర్యలు లేనందుకు 2013లో ఆస్పత్రిని హెచ్చరించినట్లు, అయితే ఆస్పత్రి అధికారులు వాటిని పట్టించుకోలేదని కూడా తెలుస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది.

భువనేశ్వర్‌లోని సమ్ ఆస్పత్రిలో సంభవించిన అగ్నిప్రమాదంలోగాయపడ్డవారిని పరామర్శిస్తున్న కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా,
ఆసుపత్రి అధినేత మనోజ్‌నాయక్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేస్తున్న నిరసన కారులు.