జాతీయ వార్తలు

జెఎన్‌యు విద్యార్థి జాడ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: జాడ తెలియకుండా పోయిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి నజీబ్ అహ్మద్ జాడ తెలుసుకోవడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇదే అంశంపై ఆందోళన చేస్తున్న యూనివర్శిటీ విద్యార్థుల నిర్బంధంలో ఉండిన వైస్ చాన్సలర్, ఇతర ఉన్నతాధికారులను 20 గంటల పాటు నిర్బంధించిన అనంతరం వారు కార్యాలయాలనుంచి వెళ్లడానికి అనుమతించారు. జాడ తెలియకుండా పోయిన విద్యార్థి నజీబ్ జాడ తెలుసుకువడానికి జెఎన్‌యు పాలనా యంత్రాంగం ఏమీ చేయడం లేదని ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఆరు రోజులుగా ఇదే అంశంపై ఆందోళన చేస్తున్నారు.
కాగా, గత శనివారం యూనివర్శిటీ హాస్టల్‌లో ఎబివిపికి చెందిన కొందరు విద్యార్థులతో గొడవ అనంతరం జాడ తెలియకుండా పోయిన నజీబ్ జాడ తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని హోం మంత్రి రాజ్‌నాథ్ ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను పిలిపించుకున్న రాజ్‌నాథ్ ఈ ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఆందోళన చేస్తున్న విద్యార్థులు నిన్న రాత్రినుంచి విసిని, మరో 12 మంది ఇతర అధికారులను యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌నుంచి బైటికి వెళ్లడానికి అనుమతించలేదు. అయితే విసిని, అధికారులను నిర్బంధించడంపై అన్ని వర్గాలనుంచి విమర్శలు రావడంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు చివరికి వారిని బైటికి వెళ్లడానికి అనుమతించారు. అయితే తాము పట్టు సడలించుకోలేదని, అకడమిక్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం కోసమే విసిని, ఇతర అధికారులను వెళ్లనిచ్చామని ఆందోళన చేస్తున్న విద్యార్థులు అంటున్నారు.