జాతీయ వార్తలు

17మందికి జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 20: మైనార్టీ వర్గానికి చెందిన 33మంది సజీవ దహనానికి సంబంధించిన సర్దార్‌పూర కేసులో 17మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను గుజరాత్ హైకోర్టు ధృవీకరించింది.
సరైన సాక్షాధారాలు లేకపోవడం వల్ల 14మందిని నిర్దోషులుగా ప్రకటించింది. గోద్రా అనంతరం 2002లో ఈ ఘాతుకం జరిగింది. బలమైన ఆధారాలు లేకపోవడం, సాక్షుల వాంగ్మూలాల్లో వ్యత్యాసాలు ఉండటం వల్లే ఈ కేసులో 14మందిని నిర్దోషులుగా ప్రకటించామని న్యాయమూర్తులు హర్ష దేవని, బిరేన్ వైష్ణవిలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచి స్పష్టం చేసింది. ఈ కేసులో 31 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం, గుజరాత్ ప్రభుత్వం చేసిన అప్పీళ్లను కూడా హైకోర్టు తిరస్కరించింది. సుప్రీ కోర్టు ఉదహరించిన ఇద్దరు సాక్షుల పరీక్ష ప్రాతిపదికగానే 14మందిని నిర్దోషులుగా ప్రకటించామని న్యాయమూర్తులు తెలిపారు. అల్లర్ల కేసుల్లో ఓ వ్యక్తిని దోషిగా నిర్ణయించాలంటే అతడు లేదా అమెకు వ్యతిరేకంగా కనీసం ఇద్దరు సాక్షులు వాంగ్మూలం ఇవ్వాలన్నది సుప్రీం కోర్టు నిబంధన. దీని ప్రాతిపదికగానే 17మందికి విధించిన శిక్షనూ ధృవీకరించామని కోర్టు తెలిపింది.