జాతీయ వార్తలు

కృష్ణపట్నంలో ఎరువుల ఫ్యాక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రభుత్వరంగంలోని క్రిబ్కో (కృషక్ భారతి కో-ఆపరేటివ్), మొరాకోకు చెందిన ఓసిపి కంపెనీ సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం ఓడరేవు సమీపంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.1500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎరువుల కర్మాగారానికి సంబంధించిన ఒప్పందాలు శుక్రవారం ఢిల్లీలో జరిగాయి. కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుక్ మాండవ్య, క్రిబ్కో అధ్యక్షుడు, ఎంపి చంద్రపాల్ సింగ్, ఎండి ఎస్ సాంబశివరావు, ఓసిపి కంపెనీ చైర్మన్, సిఈవో మొస్తాబ్ టెర్రాఫ్‌లు ఒప్పందాల కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రీన్‌ఫీల్డ్ ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 286 ఎకరాల భూమి కేటాయించింది. దీనితోపాటు కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన వౌలిక సదుపాయాలను రూ.30 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తోంది. కర్మాగారంలో తయారయ్యే కాంప్లెక్స్ ఎరువులపై ఆంధ్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిందని క్రిబ్కో ఎండి సాంబశివరావు తెలిపారు. కర్మాగారానికి అవసరమైన నీటి సరఫానూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏటా 1.2 మిలియన్ టన్నుల ఎన్‌పికె ఎరువుల ఉత్పత్తి జరుగుతుందని చెబుతూ, తమ సంస్థ ఈ ప్రాంతంలో లాజిస్టికల్ వౌలిక సదుపాయాలు కల్పించనుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపులో భాగంగానే సంయక్త రంగ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కర్మాగారంలో 1500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎరువుల రంగంలో స్వయంసమృద్ధి సాధనకు చేస్తున్న కృషిలో భాగంగానే గ్రీన్‌ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి మన్సుక్ మాండవ్య వెల్లడించారు. ఎరువుల కొరత తీర్చేందుకే మూతపడిన గోరఖ్‌పూర్, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించామన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎన్‌పికె ఎరువుల అవసరం దేశంలో ఎంతో ఉందంటూ, భూసారాన్ని పరిరక్షించుకునేలా ఎరువుల వినియోగం ఉండాలని మంత్రి సూచించారు. యూరియా పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కర్మాగారం ఏర్పాటు మూలంగా దేశంలోని రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు లభిస్తాయని క్రిబ్కో అధ్యక్షుడు చంద్రపాల్‌సింగ్ చెప్పారు.