జాతీయ వార్తలు

ఉగ్రవాదం వీడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 21: సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వస్తిచెబితేనే భారత్‌తో చర్చలు ఫలప్రదమవుతాయని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. అననుకూల వాతావరణ ఉన్నప్రస్తుత పరిస్థితుల్లో సామరస్యపూరితంగా చర్చలు అసాధ్యమని శుక్రవారం ఇక్కడ చెప్పారు. అదే సమయంలో ఇరుదేశాల చర్చలకు తెరపడలేదని ఆమె వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఎబి వాజపేయి అలంబించిన విధానాన్ని ప్రధాని మోదీ అనురిస్తే సానుకూల వాతావరణం సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని మెహబూబా తెలిపారు. చొరబాట్లను ప్రోత్సహించడం, ఎల్‌ఓసి వద్ద ఉద్రిక్తతలకు ప్రోత్సహించే చర్యలకు పాక్ పూనుకోకూడదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీసు మృతవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘జమ్మూకాశ్మీర్‌లో మిలిటెన్సీ తగ్గినప్పుడే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం ఉంటుంది. అప్పుడే చర్చలు విజయవంతం అవుతాయి’అని అన్నారు. పొరుగుదేశం పట్ల వాజపేయి ప్రభుత్వం అనుసరించిన విధానాలు మంచి ఫలితాలు ఇచ్చాయని ఆమె చెప్పారు. ఆ తరువాత అవి ముందుకువెళ్లకపోవడంతో పరిస్థితి మళ్లీ పునరావృతం అయిందని మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని ప్రధాని మోదీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అనేక సార్లు హామీ ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఆమె పేర్కొన్నారు. తన భూ భాగంపై జరుగుతున్న ఉగ్రవాద చర్యల వల్ల పాకిస్తాన్ కూడా ప్రమాదమేనని ఆమె గుర్తుచేశారు. పాక్ మార్కెట్లలలో, విద్యా సంస్థల్లో జరుగుతున్న పేలుళ్ల వల్ల వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారని ఆమె వివరించారు.