జాతీయ వార్తలు

ఆగని కాల్పుల మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, అక్టోబర్ 22: సరిహద్దుల్లో పదే పదే కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాక్ రేంజర్లపై బిఎస్‌ఎఫ్ జవాన్లు జరిపిన ఎదురు దాడుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు, ఒక ఉగ్రవాది మృతి చెందినప్పటికీ పాక్ రేంజర్లకు మాత్రం బుద్ధి రాలేదు. శుక్రవారం ఈ సంఘటన జరిగిన తర్వాత రాత్రంతా పాక్ రేంజర్లు ఆర్‌ఎస్ పురా ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలపై మోర్టార్ బాంబుల వర్షం కురిపించారు. పాక్ కాల్పులకు గురయిన ప్రాంతాల్లో కరోటన ఖుర్ద్, అబ్దుల్లియన్ తదితర ప్రాంతాలున్నాయని బిఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డికె ఉపాధ్యాయ శనివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. రాత్రి 11 గంటలకు మొదలైన ఈ బాంబు దాడులు తెల్లవారుజాము దాకా కొనసాగాయని ఆయన చెప్పారు. బిఎస్‌ఎఫ్ దళాల ఎదురుదాడి తర్వాత పాక్ కాల్పులు, మోర్టార్ దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలకు భద్రత కల్పించాలని అదికారులను కోరామని, సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు నాలుగు వందల
మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో అశ్రయం కల్పించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రాణభయంతో తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు కూడా ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, భద్రతా దళాలు శనివారం ఇద్దరు జైషే మహమ్మద్ మిలిటెంట్లను, పాక్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న ఒక గూఢచారిని అరెస్టు చేశాయి. బారాముల్లా జిల్లాలో ఇద్దరు సైనికులు, ఒక పోలీసు మృతికి కారణమైన దాడితో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఈ ఇద్దరు మిలిటెంట్లను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పాకిస్తానీ ఉగ్రవాది ఖాలిద్ నేతృత్వంలో బారాముల్లా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ముఠాలో ఈ ఇద్దరు సభ్యులని, వీరిని సఫీర్ అహ్మద్ భట్, ఫర్హాన్ ఫయాజ్‌లుగా గుర్తించినట్లు ఆ అధికారి చెప్పారు. అరెస్టయిన మిలిటెంట్లనుంచి ఒక ఎకె రైఫిల్, ఒక పిస్టల్, కొంత మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి చెప్పారు. మరోవైపు సరిహద్దుల్లో సైన్యాల మోహరింపు, కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న ఓ వ్యక్తిని సాంబా జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ జిల్లాలోని చంగీలా గ్రామానికి చెందిన బోధ్‌రాజ్ అనే వ్యక్తి ఇలాంటి గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న సమాచారం ఆధారంగా భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని అంతర్జాతీయ సరిహద్దుకు ఆనుకుని ఉన్న జెర్డా గ్రామం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడ్ని అరెస్టు చేశామని సాంబా ఎస్‌ఎస్‌పి జోగిందర్ సింగ్ చెప్పారు. అతని వద్దనుంచి రెండు పాకిస్తానీ సిమ్ కార్డులు, సరిహద్దుల్లో సైన్యాల మోహరింపునకు సంబంధించిన ఒక మ్యాప్‌ను,్భరత్‌లో తయారైన రెండు మొబైల్ ఫోన్లు, ఒక మెమరీ కార్డు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

చిత్రం.. పాక్ సైనికులు ప్రయోగించిన మోర్టార్ షెల్‌ను చూపుతున్న వృద్ధురాలు