హైదరాబాద్

నిరుద్యోగ యువతకు బల్దియా శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: నగరంలోని నిరుద్యోగ యువతకు జిహెచ్‌ఎంసి చేయూతనివ్వనుంది. వీరికి వివిధ అంశాల్లో శిక్షణనిచ్చి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందుకు గాను గ్రేటర్ పరిధిలోని బహుళజాతి సంస్థలతో పాటు, ఐటి, భారీ పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, జతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన పలు కార్యాలయాలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంస్థలకు సుశిక్షితులైన సిబ్బంది, ఉద్యోగుల కొరత భారీగా ఉన్నట్లు గుర్తించిన జిహెచ్‌ఎంసి, ఆ ఖాళీలను నగరంలోని నిరుద్యోగులతో భర్తీ చేయాలని యోచిస్తోంది. నిరుద్యోగ యువతీయువకులకు ఎంపిక చేసిన 16 అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు గాను నగరంలోని ప్రముఖ సంస్థలైన అపోలోమెడి స్కిల్స్ లిమిటెడ్, జిఎంఆర్, వరలక్ష్మి ఫౌండేషన్, టైమ్స్ సెంటర్ ఫర్ లెర్నింగ్, అసోకాం ఇండియా ప్రై.లిమిటెడ్, స్కిల్ ప్రో ఎడుటెక్ ఇండియా ప్రై.లిమిటెడ్, అల్మిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రై.లిమిటెడ్, ఇన్వల్‌యూట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రైనింగ్ ప్రై.లిమిటెడ్, సన్ స్కిల్ ట్రైనింగ్ ప్రై.లిమిటెడ్, ఓరియస్ సెక్యూరిటీ సర్వీసు ప్రై.లిమిటెడ్ లాంటి ప్రముఖ సంస్థలచే ఈ ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణలను ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. తెలంగాణ మెప్మా ఎంపిక చేసిన ఈ సంస్థల ద్వారా అందించే ఈ శిక్షణను పొందాలనుకునే వారు 18 నుంచి 35 ఏళ్లలోపు యవసు కలిగి ఉండాలని సూచించింది. ఆసక్తిగల వారు తమ సమీపంలోని సర్కిల్ కార్యాలయాల్లో 23 నుంచి 31వ తేదీ వరకు రదరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు హాజరయ్యే వారు ఆన్‌లైన్ పద్ధతిలో కూడా దరఖాస్తు సమర్పించవచ్చునని సూచించారు. ఈ దరఖాస్తు నమూనా పత్రాన్ని జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో పొందుపర్చటం జరిగిందన్నారు. ఈ శిక్షణకు హాజరయ్యేవారు కనీసం టెన్త్‌క్లాస్, ఇంటర్మీడియట్ పాసై ఉండాలన్నారు. మొదటి విడతలో దాదాపు 7వేల మందికి శిక్షణనివ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళలు, వికలాంగులకు తగిన రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం సర్ట్ఫికెట్లు అందజేసి నెలరోజుర్లో వివిధ కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ శిక్షణ పొందిన వారిలో స్వయంగా చిన్న పరిశ్రమలను స్థాపించుకునేందుకు కూడా తగు సహాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణకు గాను జిహెచ్‌ఎంసి ఒక్కోక్కరికి రూ. 8 వేల నుంచి రూ. 15వేల వరకు వెచ్చిస్తున్నట్లు ఆయన వివరించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న కమ్యూనిటీ హాళ్లు ఈ శిక్షణ కార్యక్రమానికి వినియోగించనున్నందున, స్థానికంగానే నివాసముంటే వారు శిక్షణ పొందేందుకు అవకాశముంటుందని జిహెచ్‌ఎంసి భావిస్తోంది.
శిక్షణనివ్వనున్న కోర్సులు
నిరుద్యోగ యువతీయువకులకు జిహెచ్‌ఎంసి బ్యాంకింగ్, ఫైనాన్స్ అసిస్టెంటు, ఫ్రంట్ ఆఫీసు ఎగ్జిక్యూటీవ్, జనరల్ డ్యూటీ అసిస్టెంటు, ఫార్మసీ అసిస్టెంటు, సర్వీసు అసిస్టెంటు, సర్వీస్ టెక్నీషియన్, ఏసి మెకానిక్, హాస్పిటాలిటీ అసిస్టెంటు, సెక్యూరిటీ పర్సనల్, వెబ్ డిజైనింగ్, యానిమేషన్ మల్డీమీడియా అసిస్టెంటు, ఎలక్ట్రీషియన్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ అసిస్టెంటు, స్టోర్ ఆపరేటర్స్ వంటి కోర్సుల్లో శిక్షణనివ్వనుంది.