జాతీయ వార్తలు

యుపి సహా 5 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమవుతాయని భావిస్తున్న కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటుగా అయిదు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నావిస్తోంది. ఫిబ్రవరి 1న సాదారణ బడ్జెట్‌ను సమర్పించిన కొద్ది రోజులకే ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటుగా పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకే రోజుతో పూర్తికానుండగా ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఏడు లేదా అంతకన్నా ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. రెండేళ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 70 స్థానాల్లో ఘన విజయం సాధించిన బిజెపి 15 ఏళ్ల తర్వాత సమాజ్‌వాది పార్టీ పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే మాయావతి నేతృత్వంలోని బహుజనసమాజ్ పార్టీ(బిఎస్పీ) ఈ రెండు పార్టీలు గట్టిపోటీనివ్వనుంది. ఇక పంజాబ్‌లో వరసగా రెండుసార్లు విజయవంతంగా అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్-బిజెపి కూటమికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్‌నుంచి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీనుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో న్యాయపోరాటం తర్వాత ఈ ఏడాది తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు బిజెపినుండే గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక గోవాలో బిజెపి మరోసారి అధికారం దక్కించుకోవాలని యత్నిస్తుండగా, మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ముందుజాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం ఒక వేళ ఎన్నికల కమిషన్ గనుక ఈ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే విమర్శలు రాకుండా ఉండడం కోసం లోక్‌సభలో ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని ఇసిని కోరింది. అయితే కేంద్ర బడ్జెట్ దేశమంతటికీ వర్తించేది కాబట్టి బడ్జెట్ ప్రతిపాదనకు అభ్యంతరం లేదని ఇసి కేంద్రానికి తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్లను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో ఎలాంటి ప్రజాకర్షక పథకాలను ప్రకటించకుండా జాగ్రత్త వహించాలని ఇసి సూచించినట్లు చెబుతున్నారు. కాగా ఈ రాష్ట్రాల చట్టసభల గడువు ముగియడానికి ముందే మార్చి మధ్యకల్లా ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యేలా చూడాలని ఇసి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సాఫీగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడడానికి అవసరమైన భద్రతా దళాల అందుబాటుకు సంబంధించి ఇసి కేంద్రం, రాష్టల్రతో సంప్రదింపులు కూడా జరుపుతోంది.