జాతీయ వార్తలు

కన్నీరు పెట్టొద్దన్నాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.ఎస్.పురా (జమ్మూ), అక్టోబర్ 23: ఆమె కుమారుడు దేశంకోసం అమరుడయ్యాడు... ముష్కరుల ఎదురుకాల్పుల్లో నిర్జీవంగా తిరిగొచ్చాడు... చెట్టంత కుమారుడి భౌతికకాయాన్ని చూసి ఆమె వౌనంగా రోదిస్తోంది. దేశంకోసం త్యాగం చేశాడని గర్వించాలా లేక యుక్త వయసులోనే అమరుడయ్యాడని దుఃఖించాలా- ఇంతటి విషాదంలోనూ ఆమె తన కుమారుడికి ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంది. ఆమె హృదయం ఎంతగా రోదిస్తున్నా, ఆమె మాత్రం కన్నీరు పెట్టడం లేదు. ‘అమ్మా... ఒకవేళ నేను దేశంకోసం ప్రాణాలు విడిస్తే నువ్వు బాధపడనని మాట ఇవ్వు’ అని గుర్నాంసింగ్ నా నుంచి వాగ్దానం తీసుకున్నాడని ఆమె బాధాతప్త హృదయంతో చెప్పింది. సరిహద్దు వద్ద ఎదురుకాల్పుల్లో 26 ఏళ్ల బిఎస్‌ఎఫ్ జవాన్ గుర్నాంసింగ్ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అతని భౌతికకాయాన్ని ఆదివారం జమ్మూలోని భారత్- పాక్ సరిహద్దు గ్రామమైన భలేసర్ మగోవాలికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గుర్నాంసింగ్ భౌతిక కాయానికి కన్నీటి నివాళులర్పించారు. ‘గుర్నాం అమర్ రహే’ అంటూ నినదించారు. ఇంతటి విషాద సన్నివేశంలోనూ గుర్నాం తల్లి జశ్వంత్ కౌర్ మాత్రం నిబ్బరంగా ఉన్నారు. తన కుమారుడు దేశంకోసం ప్రాణత్యాగం చేశాడని ఆమె గర్వంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు వద్ద దేశ రక్షణలో ఉన్న బిఎస్‌ఎఫ్ జవాన్లకోసం అన్ని వసతులు కలిగిన ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించాలని, గాయపడిన జవాన్లకు తక్షణం అత్యున్నత వైద్య సేవలు అందించేలా చూడాలనీ ఆమె కోరారు. సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న మా పిల్లల గురించి ఆందోళనతో ఉన్నామనీ, వారికి ఉన్నత వైద్య సేవలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గుర్నాం తండ్రి కుల్బీర్ సింగ్ మాట్లాడుతూ నా కుమారుడు దేశంకోసం అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాడన్నారు. ముష్కరుల కాల్పుల్లో గాయపడిన వారికి అత్యున్నత వైద్య సేవలతో కూడిన ఆసుపత్రి నిర్మించాలని కోరారు. పాకిస్తాన్ దీటైన జవాబు చెప్పాలనీ, భారత్‌పై దాడి చేసే సాహసం చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానిని కోరారు.
chitram...
గుర్నాంసింగ్ మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు