జాతీయ వార్తలు

పని ఒత్తిడివల్లే పొరపాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 24: సౌమ్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టిన మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరొక అడుగు ముందుకేసి ‘పని ఒత్తిడి వల్లే తీర్పులో పొరపాట్లు జరిగి ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. సౌమ్య హంతకుడు గోవిందసామికి కేరళ హైకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు యావజ్జీవ శిక్షగా మార్చిన సంగతి తెలిసిందే. గోవిందస్వామి శిక్షను తగ్గించడాన్ని తీవ్రంగా విమర్శించిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తాజాగా ఫేస్‌బుల్‌లో పోస్టింగ్ చేశారు. ‘కేరళ హైకోర్టు విధించిన మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా తగ్గించడం ద్వారా సుప్రీం కోర్టు పొరపాటు చేసిందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను’ అని ఆయన పునరుద్ఘాటించారు. ‘పని ఒత్తిడివల్లే సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పును ఇచ్చి ఉంటుంది. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను తగ్గించుకునే ప్రయత్నంలో జరిగిన పొరపాటే గోవిందసామి కేసులో చోటుకేసుకుని ఉంటుంది’ అని కట్జూ అన్నారు. సౌమ్య కేసులో ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు సుప్రీం కోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. నవంబర్ 11న కోర్టుకు హాజరయ వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. సుప్రీం ఆదేశాలపై తీవ్రంగానే స్పందించిన ఆయన కోర్టుకు హాజరకాబోనని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఆయనే 11న మధ్యాహ్నం 2 గంటలకు స్వయంగా హాజరవుతానని వెల్లడించారు. ‘ముందు నేను కోర్టుకు హాజరుకాకూడదనే నిర్ణయించుకున్నాను. కోర్టు నోటీసు చదివాను. ఆ రోజు రమ్మని నన్ను ఆదేశించినట్టు నోటీసులో లేదు. మర్యాదపూర్వంగానే పిలిచారు. కాబట్టి వెళ్తాను’ అని సోమవారం ఆయన ప్రకటించారు. బ్రిటిష్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ వ్యాఖ్యలను కట్జూ గుర్తుచేస్తూ ‘జడ్జిలు కూడా మనుషులే. పొరపాట్లు చేయడానికి ఆస్కారం ఉంది. ఇది నాకు కూడా వర్తిస్తుంది. నేను ఇచ్చిన తీర్పుల్లోనూ పొరపాట్లు జరిగి ఉంటాయి’ అని మాజీ న్యాయమూర్తి పేర్కొన్నారు.