జాతీయ వార్తలు

పోలవరంపై 21న ఎన్జీటి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్లుపై విచారణ నవంబర్ 21 తేదీకి వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ పరిధి నుంచి జలవనరుల శాఖకు బదిలీచేయాలని ఏపీ ప్రభుత్వం సోమవారం ఎన్జీటికి విజ్ఞప్తి చేసింది. ఎన్జీటి చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడిన ట్రిబ్యునల్ పర్యావరణ శాఖపై ఉన్న అభ్యంతరాలేమిటని ప్రశ్నించింది. పోలవరం నిర్మాణం జలవనరుల శాఖ చేపడుతుందని, అందుకు ఆ శాఖ బదిలీచేయాలని ఏపి తరపు న్యాయవాది అన్నారు. అందుకు ట్రిబ్యునల్ అంగీకరించింది.