జాతీయ వార్తలు

మోదీ మాట.. ఓటుకు బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ట్రిపుల్ తలాక్’ను వ్యతిరేకించటం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి బాగా కలిసి వస్తుందని బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ దుర్నీతితో విసిగి వేసారిన ముస్లిం మహిళలు ఈసారి బిజెపికి ఓటు వేస్తారని వారు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది మంచి విధానం కాదని ఎన్‌డిఏ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో మోదీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో బిజెపి ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగిస్తూ, ట్రిపుల్ తలాక్ విధానాన్ని గట్టిగా విమర్శించారు. హిందు మతంలో ఆడ పిల్లలను పుట్టగానే చంపే విధానం ఎంతో దారుణమైనదని, ఇదేవిధంగా ముస్లిం మహిళల జీవితాలను దుర్భరం చేస్తున్న ట్రిపుల్ తలాక్ విధానం కూడా మంచిది కాదని మోదీ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో గందరగోళంలో పడింది. ఇదేవిధంగా ‘అవుట్ సోర్సింగ్ విధానం’పై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో గొడవకు దిగుతున్నారు. మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కూడా అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం మహిళలు తమవైపు మొగ్గుచూపితే బిజెపి విజయం మరింత సునాయసమవుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రావాలంటే ముస్లింల మద్దతు ఎంతో అవసరం. రాష్ట్రంలో ముస్లింలు ఎన్నడూ బిజెపికి అనుకూలంగా ఓటు వేయకపోయినప్పటికీ ఈసారి ట్రిపుల్ తలాక్ వివాదం మూలంగా వారు తమవైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నదని బిజెపి సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలన్న నరేంద్ర మోదీ డిమాండ్ ప్రభావం ముస్లిం మహిళలపై ఉంటుందని సమాజ్‌వాదీ, బహుజన సమాజ్, కాంగ్రెస్ నాయకులు కూడా అంచనా వేస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసే మహిళలు కూడా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నారు. దీంతో ట్రిపుల్ తలాక్ మూలంగా కష్టాల పాలవుతున్న ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మోదీ ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, బిఎస్‌పి, సమాజ్‌వాదీ పార్టీలు ఇంతవరకు ట్రిపుల్ తలాక్‌ను బహిరంగంగా విమర్శించలేదు. తలాక్ విధానాన్ని విమర్శిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఈ పార్టీలు భయపడుతున్నాయి.