జాతీయ వార్తలు

ఆగని పాక్ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, అక్టోబర్ 24: జమ్ముకాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను మరింత తీవ్రతరం చేసింది. జమ్ము జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనేక సబ్ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం ఉద్ధృతంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ ఆరేళ్ల బాలుడు, ఒక జవాను మరణించారు. సుమారు 25 బోర్డర్ అవుట్‌పోస్ట్‌లను లక్ష్యం చేసుకుని పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఆర్‌ఎస్ పురా, అర్నియా, సుచేత్‌గఢ్, కనచక్, పర్గ్వాల్ ప్రాంతాల్లో భారీఎత్తున మోర్టార్ షెల్స్‌ను పేల్చింది. ఆర్‌ఎస్ పురాలోని లాలియాల్ గ్రామంలో పౌర ఆవాసాలపై ఎలాంటి హెచ్చరిక లేకుండా జరిపిన కాల్పుల్లో వికి కుమార్ అనే బాలుడు చనిపోయాడని, ఇతని కుటుంబం కూలీ పనికోసం బిహార్ నుంచి వలస వచ్చిందని బిఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. మరోవైపు హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన సుశీల్‌కుమార్ అనే కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. ఒక స్ల్పింటర్ వచ్చి మెడకు తగలటంతో గాయపడిన సుశీల్‌ను ఆసుపత్రికి తరలించాక వైద్యులు అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సుశీల్‌కుమార్‌కు సాల్యూట్ చేస్తున్నట్లు బిఎస్‌ఎఫ్ డిజి కెకె శర్మ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ కాల్పుల్లో కనీసం 130 మంది వరకు గాయపడ్డారని ఆయన తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో ఇళ్లకు వివిధ స్థిరాస్థులకు భారీగా నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం.. పాక్ కాల్పుల్లో మృతిచెందిన బిఎస్‌ఎఫ్ జవాను సుశీల్‌కుమార్ శవపేటికవద్ద నివాళులర్పిస్తున్న బిఎస్‌ఎఫ్ డిజి కెకె శర్మ