జాతీయ వార్తలు

ఆగని పాక్ కాల్పుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, అక్టోబర్ 25: కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాక్ సైన్యం మంగళవారం జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున మోర్టార్లతో కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులకు స్పందించిన బిఎస్‌ఎఫ్ బలగాలు తగిన రీతిలో గట్టిగా సమాధానం చెప్తున్నాయి. మన జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో పాక్ సైపున ఇద్దరు లేదా ముగ్గురు సైనికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఉదయం పది గంటలకు మొదలైన ఈ కాల్పులు సాయంత్రం దాకా కూడా కొనసాగుతున్నట్లు ఆ అధికారి తెలిపారు. కాగా, ఈ కాల్పుల్లో మన వైపు ఎవరూ చనిపోవడం కానీ, గాయపడ్డం కానీ జరగలేదని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా జమ్మూ జిల్లాలోని ఆర్‌ఎస్ పురా సెక్టర్‌కు చెందిన సుచేత్‌గఢ్‌లో మంగళవారం సాయంత్రం పాక్ రేంజర్లు పేల్చిన మోర్టార్ షెల్ ఒకటి ఇంటిలోపల పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మహిళలు గాయపడ్డారు. వారికి ఆర్‌ఎస్‌పుర ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించన తర్వాత మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆస్పత్రికి తరలిస్తున్నట్లు జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రన్‌దీప్ సింగ్ చెప్పారు.