జాతీయ వార్తలు

యెడ్యూరప్ప నిర్దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 26: గనుల అక్రమ తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్పకు పెద్ద ఊరట లభించింది. అక్రమ మైనింగ్‌లో అవినీతికి పాల్పడినట్లు నమోదయిన కేసులో యెడ్యూరప్పను నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక సిబిఐ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. యెడ్యూరప్ప ఇద్దరు కుమారులు, అల్లుడు, మరో తొమ్మిది మంది నిందితులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వెలువడిన ఈ తీర్పు యెడ్యూరప్ప రాజకీయంగా మళ్లీ ఎదగడానికి దోహదపడేలా ఉంది. యెడ్యూరప్ప ఈ సంవత్సరం ఏప్రిల్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి నియమితులయ్యారు. బళ్లారిలో జరిగిన గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంలో రూ. 40 కోట్ల మేరకు అవినీతి జరిగిందనేది ఈ కేసులోని అభియోగం. బుధవారం కిక్కిరిసిన కోర్టు హాలులో ప్రత్యేక సిబిఐ న్యాయమూర్తి ఆర్‌బి ధర్మగౌడర్ తీర్పు వెలువరిస్తూ కేసులోని మొత్తం 13 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద నిందితులు నేరం చేసినట్టు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘అవినీతి నిరోధక చట్టం కిందే కాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల కింద నిందితులు నేరానికి పాల్పడినట్లు చేసిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయింది. అందువల్ల ఈ కోర్టు ఈ కేసులోని నిందితులందరిని నిర్దోషులుగా నిర్ణయించింది’ అని న్యాయమూర్తి 400కు పైగా పేజీలతో కూడిన తన తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసు నుంచి ప్రధాన నిందితుడయిన 73 ఏళ్ల యెడ్యూరప్పతో పాటు అతని కుమారులు బివై రాఘవేంద్ర (ఎమ్మెల్యే), బివై విజయేంద్ర, అల్లుడు ఆర్‌ఎన్ సోహాన్ కుమార్, మాజీ మంత్రి ఎస్‌ఎన్ కృష్ణయ్య శెట్టి, మరో తొమ్మిది విముక్తులయ్యారు.
తీర్పు వెలువరించిన వెంటనే కోర్టు హాలులో ఉన్న యెడ్యూరప్ప ముఖంలో నవ్వు కనిపించింది. బాగా ఆనందంలో మునిగిన అతని ఇద్దరు కుమారులు తమ బావ సోహాన్ కుమార్‌తో ఆ సంతోషాన్ని పంచుకున్నారు. కోర్టు బయట యెడ్యూరప్ప మద్దతుదారులు విజయోత్సవం జరుపుకున్నారు. టపాకాయలు కాల్చారు. తీర్పు వెలువడిన తరువాత యెడ్యూరప్ప ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో సంతోషం వ్యక్తం చేశారు.
‘సత్యమేవ జయతే. న్యాయం జరిగింది. నేను నిర్దోషిగా నిలిచాను’ అని ఆయన పేర్కొన్నారు.
chitram...
తీర్పు వెలువడిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న యెడ్యూరప్ప