జాతీయ వార్తలు

పాక్‌పై ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 29: పాకిస్తాన్‌పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. వాస్తవాధీన రేఖ వద్ద వరుసగా పాల్పడుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాకిస్తాన్ భారీ మూల్యానే్న చెల్లించాల్సి వచ్చింది. కేరన్ సెక్టార్‌లో భారత సైన్యం పెద్ద ఎత్తున జరిపిన ఎదురుకాల్పులకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన నాలుగు ఆర్మీ పోస్టులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ వైపు భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని ఉత్తరకమాండ్ శనివారం రాత్రి పొద్దు పోయాక ఒక ప్రకటనలో పేర్కొంది. 20మందికి పైగా పాక్ జవానులు హతమైనట్లు ఆర్మీ సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కేరన్ సెక్టార్‌లో పాక్ బలగాలు పాల్పడుతున్న వరుస కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ఇదే ప్రాంతంలో ఒక మహిళ, ఒక జవాను మరణించిన సంగతి తెలిసిందే. పాక్ కాల్పులకు ప్రతిగా భారత్ జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. కథువా సెక్టార్‌లో కూడా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కుప్వారా జిల్లాలోని మచ్చిల్ సెక్టార్‌లో పాక్ ఉగ్రవాదులు, పాక్ కాల్పుల్లో చనిపోయిన భారత జవాను మన్‌దీప్‌సింగ్ మృతదేహాన్ని ముక్కలు చేసి, తలను ఛిద్రం చేసి కిరాతకంగా వ్యవహరించిన నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం ప్రకటించిన పనె్నండు గంటల్లోనే చెప్పింది చేసి చూపించింది. అంతకు ముందు 15మంది పాక్ రేంజర్లను హతమార్చినట్లు సైన్యం శుక్రవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఉగ్రవాదులు మన్‌దీప్‌సింగ్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. దీంతో పాటు ఆర్ ఎస్ పురా సెక్టార్‌లో ఇద్దరు పౌరులు కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్‌కు దీటుగా జవాబిచ్చింది.