జాతీయ వార్తలు

నలుగురు హైకమిషన్ అధికారులు వెనక్కి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 1: ఢిల్లీ హైకమిషన్‌లో పనిచేస్తున్న నలుగురు అధికారులను స్వదేశానికి రప్పించాలని పాక్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకమిషన్ ఉద్యోగి ఒకరు గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు ఇటీవల బయటపడ్డ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఈ అంశం పరిశీలనలో ఉంది. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని పాక్ విదేశాంగ కార్యాలయ వర్గాల ఉటంకిస్తూ డాన్ పత్రిక వెల్లడించింది. కమర్షియల్ కౌన్సిలర్ సయ్యద్ ఫరూఖ్ హబీబ్, ఫస్ట్ సెక్రెటరీ ఖదీమ్ హుస్సేన్, ముదస్సిర్ చీమా, షాహిద్ ఇక్బల్‌లను వెనక్కి రప్పించనున్నట్టు తెలిసింది. గూఢచర్యం ఆరోపణలపై మహమూద్ అక్తర్‌ను భారత్‌నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అక్తర్ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. దౌత్య నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో వీసా విభాగంలో పనిచేస్తున్న అక్తర్ సరిహద్దులో బిఎస్‌ఎఫ్ దళాల కార్యకలాపాలకు సంబంధించి రహస్యాలు చేరవేస్తున్నట్టు వెల్లడైంది.