జాతీయ వార్తలు

రాజధాని నిర్మాణం వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబరు 1: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని వివరాలను తమకు తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటి) మంగళవారం ఆదేశించింది. అమరావతి నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లపై ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నాడు విచారణ జరిపింది. నూతన రాజధానిపై ఎన్జీటిపై గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతున్నదని పిటిషనర్ల తరపు న్యాయవాది సంజయ పారిక్ ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. పర్యాటక అభివృద్ధి పేరిట రాష్ట్రప్రభుత్వం కృష్ణా నదిలోని ద్వీపాల్లో వాణిజ్య నిర్మాణాలు చేపడుతోందని ట్రిబ్యునల్‌కి వివరించారు. అలాగే వరద ముంపు ప్రాంతమైన గుంటూరు జిల్లా లింగాయపాలెంలో రోడ్డు నిర్మాణాలను ప్రారంభించిదన్నారు. కొండవీటి వాగుకు వరదలోస్తే రాజధాని ప్రాంతంలోని సుమారు 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రభావం ఉటుందని, ఆ వాగును ప్రవాహ దిశను మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సంజయ్ పారిక్ ఎన్జీటికి వివరించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని ప్రభుత్వం ప్రతిపాదిత ప్రాంతాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ భూముల్లోనే రాజధాని నిర్మాణం చేపడుతున్నారని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. నిర్మాణాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమకు తెలియజేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి జీవనోపాధికి ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని తెలిపింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. బుధవారం నాడు పిటిషన్లు తరపు న్యాయవాది సంజయ్ పారిక్ వాదనలు వినిపించానున్నారు.