జాతీయ వార్తలు

టిప్పు సుల్తాన్ నియంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 2: టిప్పు సుల్తాన్ ఓ నియంత అనీ, ఆయన ఏమాత్రం స్వాతంత్య్ర సమరయోధుడు కాదంటూ కర్నాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ నియంత జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం జరపడం వెనుక సహేతుకతను ప్రశ్నించింది. టిప్పు సుల్తాన్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికే పోరాడాడే తప్ప స్వాతంత్య్రం కోసం కాదని, దాని దృష్ట్యా ఆయన్ని స్వాతంత్య్ర సమరయోధుడుగా పరిగణించలేనని కోర్టు తెలిపింది. ‘టిప్పు సుల్తాన్ జయంతిని మీరో ఉత్సవంగా జరుపుకోవడం వెనుక సహేతుకత ఏమిటి’ అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం జరపడాన్ని సవాలు చేస్తూ కె.పి.మంజునాథ దాఖలు చేసిన ఓ ప్రజాహిత పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కమల్ ముఖర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల కొడగు జిల్లాలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మత పరమైన ఉద్రిక్తతలు నెలకొనే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతున్న దృష్ట్యా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది కూడా ఈ రకమైన కార్యక్రమం తీవ్ర స్థాయిలో శాంతి భద్రతల సమస్యకు కారణమైంది. అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎం.ఆర్. నాయక్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. టిప్పు సుల్తాన్ ఓ పెద్ద యోధుడనీ, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడాడని తెలిపారు. అయితే, పిటిషనర్ తరపు న్యాయవాది కూవయ్యా కూడా చాలా గట్టిగానే తన వాదన వినిపించారు. టిప్పు సుల్తాన్‌ను నియంతగా పేర్కొన్న ఆయన కొడవ, కొంకణీలు, క్రిస్టియన్లు కూడా అనేక వర్గాలకు చెందినవారిని హతమార్చాడని తెలిపారు. ఈ అంశంపై భిన్న వాదనలు వినిపించిన దృష్ట్యా తదుపరి విచారణకు గురువారానికి వాయిదా పడింది.