జాతీయ వార్తలు

జనావాసాలపై దాడులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, నవంబర్ 2: అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ రేంజర్లు జమ్మూలోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారని సరిహద్దు భద్రతా దళం ఆరోపించింది. గత కొన్ని వారాలుగా పాక్ రేంజర్లు జరుపుతున్న ఈ కాల్పుల వెనుక పాకిస్తాన్ సైనిక హస్తం ఉందని బిఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డి.కె.ఉపాధ్యాయ బుధవారం నాడిక్కడ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పౌర ప్రాంతాలపై కాల్పులు జరపడమన్నది అంతర్జాతీయ నియమ నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. భారత దళాలు ఎప్పుడూ కూడా పాక్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పాక్ కాల్పుల్లో ఎనిమిదిమంది కాశ్మీర్ పౌరులు మరణించిన నేపథ్యంలో తాము ఎనిమిది పాక్ సైనిక శిబిరాలను ధ్వంసం చేసిన విషయాన్ని ధ్రువీకరించారు.
సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కు
కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు జరుపుతున్న దాడులు ఆయా ప్రాంతాల వాసుల్లో అనునిత్యం నరకానే్న కళ్లకు కడుతున్నాయి. ఎప్పుడు తూటాలు దూసుకొస్తాయో, ఫిరింగి గుళ్లు మీదపడతాయో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా సాంబా జిల్లాలోని రాంగఢ్ సెక్టార్‌లో నివసిస్తున్న ప్రజలకు అనునిత్యం ప్రాణభయం వెంటాడుతోంది. అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న ఈ ప్రాంత గ్రామాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని బాంబులతోనూ, బుల్లెట్లతోనూ పాక్ రేంజర్లు దాడులు జరపడంతో ఇటీవలి కాలంలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. ప్రతిరోజూ తాము చావుకు దగ్గరగా వెళుతున్నామని, తృటిలో తప్పించుకుంటున్నామంటూ గ్రామస్థులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా ఇటు బాంబు దాడులతో, కాల్పులతో పాక్ రేంజర్లు ప్రశాంతతకు తూట్లు పొడుస్తున్నారని, బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులను కల్పిస్తున్నారని వెల్లడించారు. భారత్, పాక్ దళాల మధ్య జరుగుతున్న పరస్పర కాల్పుల్లో చిక్కుకున్న తమకు నిత్యం ప్రాణభయమేనంటూ మంగళవారం జరిగిన కాల్పుల్లో మరణించిన మారారామ్ అనే వ్యక్తి బంధువు కమలేష్ కుమారి వెల్లడించారు. నిన్నటి కాల్పుల్లో గాయపడ్డ మారారామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ కాల్పుల్లో 14 నెలల ఆయన మునిమనుమరాలు కూడా గాయపడింది. ఆ ఘటనలో గాయపడిన అనేకమందికి ఇప్పటికీ నోట మాట రాని పరిస్థితే.