జాతీయ వార్తలు

ఎస్పీలో ఐక్యతా రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 3: సమాజ్‌వాదీ పార్టీలో సాగుతున్న అంతఃకలహాల నేపథ్యంలో ఆ పార్టీ నిర్వహించతలపెట్టిన రథయాత్రపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ నిర్వహించ తలపెట్టిన ఈ రథయాత్రను అధినేత ములాయం స్వయంగా ప్రారంభించడమే కాకుండా, ఆయన బాబాయి శివపాల్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పార్టీ ఐక్యంగా ఉందనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. రథయాత్ర ప్రారంభమయ్యే లా మార్టినీర్ గ్రౌండ్స్‌కు అఖిలేష్ చేరుకున్న కొద్ది సేపటికే ములాయం చేరుకున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికి శివపాల్ యాదవ్ వారిలో కలిశారు ములాయం వేదికపై మధ్యలో ఆసీనులు కాగా, ఆయనకు ఒకవైపున అఖిలేష్, మరోవైపున శివపాల్ కూర్చొని అసెంబ్లీ ఎన్నికల ముందు తమ పార్టీ ఐక్యంగా ఉందనే సంకేతాలను పంపారు. అఖిలేష్‌కు తాను శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు శివపాల్ చెప్పారు. ‘కీలకమైన 2017 ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం’ అని ఆయన ప్రకటించారు. రథయాత్రను ప్రారంభించడానికి ముందు అఖిలేష్ మాట్లాడుతూ ఈ చరిత్రాత్మక యాత్ర నిర్వహణకు కృషి చేసిన యువతకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని ఈ యాత్ర ద్వారా ప్రజలను కోరుతున్నట్టు ఆయన చెప్పారు.
రథయాత్ర ఒక కిలోమీటరు దూరం సాగగానే అఖిలేష్ హైటెక్ రథం మొరాయించింది. దీంతో ఆయన తన అధికార వాహనంలోకి మారి రథయాత్రను కొనసాగించారు. ‘నేతాజీ (ములాయం), శివపాల్ సహా అందరు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది.. రానున్న కాలంలో మరింత మంది వచ్చి చేరుతారు’ అని ముఖ్యమంత్రి అఖిలేష్ రథయాత్రలో మాట్లాడుతూ అన్నారు. సీనియర్ మంత్రి ఆజంఖాన్ ఆశీస్సులు తనకు ఉన్నాయని, ఆయన త్వరలోనే తన యాత్రలో కలుస్తారని అఖిలేష్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ములాయం మాట్లాడుతూ రథయాత్రకు ఉపక్రమించిన అఖిలేష్‌ను తాను అభినందిస్తున్నానని, ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

చిత్రం.. ప్రచార రథం మొరాయంచడంతో కాన్వాయ్ నుంచే యాత్ర చేస్తున్న అఖిలేష్