జాతీయ వార్తలు

చర్చలను కొనసాగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: కౌంటర్ టెర్రరిజంతోపాటు పరస్పర ఆసక్తి, ఆందోళనకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి చర్చల ప్రక్రియను కొనసాగించాలని భారత, చైనా దేశాలు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారత జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్, చైనా జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు యాంగ్ జీచి మధ్య శుక్రవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అవగాహన కుదిరిందని విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వివరించింది. దోవల్ నిన్న హైదరాబాద్‌లో యాంగ్ జీచితో చర్చలు జరిపారు. యాంగ్ జీచి గత రెండు నెలల్లో మూడోసారి భారతదేశం వచ్చి చర్చలు జరపటం గమనార్హం.
రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై జరిగిన చర్చల్లో ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వం, పాకిస్తానీ ఉగ్రవాది అజర్ మసూద్‌పై నిషేధం విధించటం గురించి సంప్రదింపులు జరిగాయా లేదా అనేది విదేశాంగ శాఖ వెల్లడించలేదు. ఎన్‌ఎస్‌జిలో భారత దేశానికి సభ్యత్వం ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్న చైనా ఇటీవల ఐక్యరాజ్యసమితి అజర్ మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని గట్టిగా వ్యతిరేకించటం తెలిసిందే. పాకిస్తాన్ ప్రయోజనాలను కాపాడేందుకే చైనా ఈ విధంగా వ్యవహరించటం తెలిసిందే. భారత, చైనా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకు అజిత్ దోవల్, యాంగ్ జీచీ రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు సీనియర్ అధికారుల మధ్య చర్చలు స్నేహ పూర్వక, సుహృద్భావ వాతావరణంలో జరిగాయనీ, ద్వైపాక్షిక సంబంధాలతోపాటు పలు అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, కౌంటర్ టెర్రరిజం అంశాలపై జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చలను ఇదే విధంగా కొనసాగించాలనే అవగాహన కుదిరిందని ప్రకటనలో తెలపారు. కౌంటర్ టెర్రరిజంపై త్వరలోనే జరుగనున్న ఉన్నతస్థాయి చర్చలు రెండు దేశాల ఆలోచనా విధానాల సమాగమానికి నిదర్శనమని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.