జాతీయ వార్తలు

రాహుల్‌కు పార్టీ పగ్గాలు లేనట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించడం మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థాగత ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేయాలని పార్టీ అదినేత్రి భావిస్తూ ఉండడమే దీనికి కారణం. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలను ఈ ఏడాది డిసెంబర్ దాకా వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాకా ఈ ఎన్నికలను వాయిదా వేయాలని పార్టీలోని ఒక వర్గం భావిస్తూ ఉండడం వల్ల సోమవారం జరిగే పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించడానికి సమయం చాలా తక్కువగా ఉందని, అంతేకాక వచ్చే ఏడాది ప్రారంభంలో వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టాల్సి ఉన్నందున ఈ ఎన్నికలను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే సంస్థాగత ఎన్నికల విషయం ఎలా ఉన్నా రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలను అప్పగించాలనే దానిపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా నిర్ణయాన్ని వాయిదా వేయాలని అభిప్రాయ పడుతుండగా, సోనియా గాంధీయే పార్టీని ముందుండి నడిపించాలని మరో వర్గం భావిస్తోంది.
కాగా, సోమవారం జరగబోయే సిడబ్ల్యుసి సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చర్చించవచ్చని తెలుస్తోంది. ఈ నెల 16నుంచి పార్లమెంటు శీతాకాల సమావేవాలు ప్రారంభం కానుండడంతో సమావేవాల్లో అనుసరించాల్సిన వ్యూసాన్ని సైతం పార్టీ ఈ సమావేశంలో ఖరారు చేయనుంది.