మెదక్

కృత్రిమ కొరత సృష్టిస్తే పిడియాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 15: అమాయకుల అవసరాలను ఆసరా చేసుకొని ఉప్పు, నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టిస్తే ఎంత మాత్రం సహించేదిలేదని, అవసరమైతే పిడి యాక్టు అమలు చేస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల పరిదిలో పర్యటించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ఉప్పును బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుతోందని, వ్యాపారులు అక్రమ పద్ధతులకు అలవాటు పడి వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తే నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడానికి వెనుకాడబోమని పేర్కొన్నారు. అలాగే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించి రీ సైక్లింగ్‌కు పాల్పడితే ఊరుకునేదిలేదని, రేషన్ బియ్యాన్ని విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు పండించిన దాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసినా, అక్రమ నిల్వలు ఉంచినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని వివరించారు.