జాతీయ వార్తలు

పదిహేనేళ్లలో 10కోట్ల మందికి మధుమేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15:దేశంలో 2030 నాటికి భారత్‌లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 101 మిలియన్లకు పెరుగుతుందని అపోల్ మునిచ్ ఆరోగ్య బీమా సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 70 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని, మరో 80 వేలమంది ప్రి డయాబెటిస్ వ్యాధి లక్షణాలతో ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. నీల్సన్ ఇండియా సంస్థతో కలిసి సర్వే చేసిన వివరాలను ఆ సంస్ధ సిఇవో ఆంటోనీ జాకబ్ తెలిపారు. ప్రతి ఐదుగురిలో నలుగురు మధుమేహాన్ని అరికట్టలేమని, నియంత్రించగలమనే అభిప్రాయంతో ఉన్నారని, ఒత్తిడి వల్ల మధుమేహం వస్తుందని 75 శాతం మంది విశ్వసిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల మధుమేహం బారినపడకుండా ఉండగలమని 80 శాతం మంది నమ్ముతున్నారన్నారు. మధుమేహ వ్యాధి వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే అభిప్రాయంతో 81 శాతం మంది ఉన్నారన్నారు. తాము సర్వే చేసిన వారిలో 19 శాతం మంది జిమ్, యోగా తరగతులకు హాజరవుతున్నారన్నారు. జీవన శైలి సరిగా లేనివాళ్లు 40 ఏళ్లు వచ్చేసరికి మధుమేహ వ్యాధి బారినపడుతున్నారన్నారు. ఇతర రోగాలతో బాధపడేవారు సగటున ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరేవాళ్లు 4.5 రోజులు ఉంటే, డయాబెటిస్‌తో బాధపడేవారు ఏడు రోజులు ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తోందన్నారు.