క్రీడాభూమి

టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ కోహ్లీకి మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 30: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా మూడో స్థానం సంపాదించాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) 898, జో రూట్ (ఇంగ్లాండ్) 847 పాయింట్లతో మొదటి రెండు స్థానాలను ఆక్రమించగా, కోహ్లీ 833 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత ఆటగాళ్లలో చటేశ్వర్ పుజారా 760 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ 891 పాయింట్లు సంపాదించి, అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రంగన హెరాత్ (శ్రీలంక) 867, డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) 844 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ అశ్విన్ నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. షకీబ్ అల్ హహన్ (బంగ్లాదేశ్), బెన్ స్టోక్స్ (ఇం గ్లాండ్) రెండుమూడు స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజాకు 4వ స్థానం దక్కింది.
బ్యాటింగ్‌లో ‘టాప్-10’
1. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా), 2. జో రూట్ (ఇంగ్లాండ్), 3. విరాట్ కోహ్లీ (్భరత్), 4. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్), 5. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా), 6. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), 7. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), 9. చటేశ్వర్ పుజారా (్భరత్), 10. యూనిస్ ఖాన్ (పాకిస్తాన్).
బౌలింగ్‌లో ‘టాప్-10’
1. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్), 2. రంగన హెరాత్ (శ్రీలంక), 3. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), 4. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్), 5. జొష్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా), 6. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్), 7. రవీంద్ర జడేజా (్భరత్), 8. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), 9. యాసిర్ షా (పాకిస్తాన్), 10. నీల్ వాగ్నర్ (ఆస్ట్రేలియా).
అల్‌రౌండర్స్‌లో ‘టాప్-10’
1. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్), 2. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), 3. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), 4. రవీంద్ర జడేజా (్భరత్), 5. మోయిన్ అలీ (దక్షిణాఫ్రికా), 6. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా), 7. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), 8. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్), 9. క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్), 10. రంగన హెరాత్ (శ్రీలంక).
* టీం ర్యాంకింగ్స్‌లో భారత్‌ది నంబర్ వన్ స్థానం.