అనంతపురం

పసుపు, కుంకుమతో మరోసారి మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 4 : పసుపు, కుంకుమ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మహిళలు జాగ్రత్తగా ఉండాలని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం మడకశిర నీలకంఠ కోల్డ్‌స్టోరేజీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాల అనంతరం డ్వాక్రా మహిళలను మభ్య పెట్టేందుకు పసుపు, కుంకుమ పథకం ప్రవేశపెట్టారని విమర్శించారు. తొలుత ఇచ్చిన రూ.3వేల నగదు అప్పులపై వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. చంద్రబాబు బహిరంగ సభల్లో ఇచ్చిన హామీల్లో 17 శాతం కూడా అమలు చేయలేదన్నారు. ఈ విషయం అతని కార్యాలయం నుంచే ప్రకటన వెలువడిందన్నారు. రాజకీయాల కోసం అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా పథకం పేరును మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఆ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయితే కేవలం 10 శాతం పనులు రెండున్నరేళ్లలో పూర్తి చేయకుండా అంచనా వ్యయాన్ని పెంచి నిధులు దోచుకున్నారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన ప్రతిష్ట దిగజార్చారన్నారు. భారీ ప్రాజెక్టులకు పెట్టాల్సిన పేరును చిన్న ప్రాజెక్టులకు పెడుతూ ఎన్టీఆర్‌ను అవమాన పరుస్తున్నారన్నారు. తన పర్యటనల్లో హామీలు ఇవ్వడం, తర్వాత మరచిపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పర్యాటక రంగం అభివృద్ధి కోసం రూ.50 కోట్ల నిధులు ఇచ్చారని, ఆ నిధులను పర్యాటక కేంద్రంలో ఎక్కడ ఖర్చు చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మడకశిర నియోజకవర్గంలో అన్ని చెరువులకు హంద్రీనీవా నీటిని తీసుకుని రావడానికి ఎత్తిపోతల పథకం ద్వారా చర్యలు తీసుకుని కాలువలు తవ్వి ఏర్పాట్లు చేశామన్నారు. రాళ్లపల్లి వద్ద రిజర్వాయర్ అవసరం లేదన్నారు. ఈ రిజర్వాయర్ డబ్బు సంపాదించుకోవడానికి తప్ప ప్రజల కోసం కాదన్నారు. చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలసి సమన్వయంతో పనిచేద్దామని చెప్పడం కేవలం ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టు నిర్మించి 120 టిఎంసిల నీటిని ఉపయోగించుకుంటున్నా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. బ్యాంకుల్లో మహిళలు బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు చేయలేదన్నారు. మరోవైపు ప్రధాని మోదీ నోట్ల రద్దు ప్రకటనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ప్రస్తుతం మహిళల బంగారంపై కనే్నసి ఆంక్షలు విధించారన్నారు. ఇలాంటి ప్రభుత్వాలకు మహిళలు తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. ఖరీఫ్‌లో వేరుశెనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు బీమాతో సంబంధం లేకుండా ఎకరాకు రూ.15 వేలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డిసిసి అధ్యక్షులు కోటా సత్యం పాల్గొన్నారు.