ఖమ్మం

పిడి యాక్టు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 5: జిల్లాలో కల్తీకారం మాఫియా తన పంజాను విసరి ప్రజారోగ్యాన్ని కాలరాస్తూ వందలకోట్ల రూపాయల వ్యాపారానికి శ్రీకా రం చుట్టిన దోషులపై పిడియాక్టు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ధర్నాచౌక్‌లో కాల్తీకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కల్తీకి అడ్డాగా మారిందని, దానికి ప్రజాప్రతినిధుల అండతోనే వర్ధిల్లుతుందని ఆరోపించారు. మొన్న కల్తీనూనె, నిన్న కల్తీ మిరప విత్తనాలు, నేడు ప్రజలకు చికిత్స కందని ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే కల్తీకారం తయారీతో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిందన్నారు. గత నెల 25న వెలుగు చూసిన కల్తీకారం వ్యవహారంపై అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఇప్పటికే 1,75,800 బస్తాల కల్తీకారాన్ని గుర్తించి సీజ్ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. పట్టుబడిన కల్తీకారం బస్తాల విలువ దాదాపు 45కోట్ల ఖరీదు ఉంటుందని, సంవత్సర కాలంగా జరుగుతున్న ఈ వ్యాపారం వందలకోట్లు ఉంటుందన్నారు. 40 మంది ముఠాగా ఏర్పడ్డ మాఫియాకు ప్రజాప్రతినిధుల అండదండలు మెండుగా ఉండబట్టే వారిని నేటికి అరెస్టు చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ బంగారు తెలంగాణ తెస్తామన్న కెసిఆర్ అధికారంలోకి రాగానే కల్తీ తెలంగాణగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన అధికార పార్టీ కార్పొరేటర్ కల్తీకారం వ్యాపారంలో కీలకంగా ఉన్నారన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ 8 రోజులుగా కల్తీకారంపై వివిధ కోల్డ్‌స్టోరేజ్‌లపై దాడులుచేసి కారం బస్తాలను సీజ్ చేశామన్నారు. వాటి శ్యాంపిల్స్‌ను పరీక్షలకు పంపించామన్నారు. మరో 5రోజుల్లో నిందితులపై పిడియాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు. ఈ ధర్నా లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు యర్రా శ్రీకాంత్, మాదినేని రమేష్, బండి రమేష్, యర్రా శ్రీనివాసరావు, వై విక్రమ్, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, నందిపాటి మనోహర్, బి మల్సూర్, గట్టు రమాదేవి, వాసిరెడ్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
* ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 5: ఖమ్మం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. విధులను బహిష్కరించిన కార్మికులు ఉదయానే్న కార్పొరేషన్ గేట్ తెరవకుండా బైఠాయించారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ అక్టోబర్, నవంబర్ వేతనాలు ఇంతవరకు చెల్లించకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికులకు రోజుకు నాలుగుసార్లు బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు చేయాలని, రోజుకు రెండుసార్లు మాత్రమే హాజరు తీసుకోవాలని కోరారు. ఐటి పేరుతో వేతనాలలో కోత విధించడం సరికాదన్నారు. తమ సమస్యలు తీరేంత వరకు ఆందోళన ఆపేది లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెను చేపడుతామని హెచ్చరించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. కార్మిక సంఘాల నాయకులకు నచ్చచెప్పినప్పటికీ వారు ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో వారు నగర పాలక సంస్థ అధికారులను పిలిపించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీనివ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఈ ఆందోళనలో ఆయా సంఘాల నాయకులు తుమ్మా విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు, ఎండి పాషా, ఆవుల అశోక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.