జాతీయ వార్తలు

రేపు పిఎస్‌ఎల్‌వి సి-36 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 5: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి బుధవారం ఉదయం 10.25గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-36 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 36గంటల ముందు నుంచి అంటే సోమవారం రాత్రి 10.25గంటలకు ప్రారంభమైంది. దీనికి సంబంధించిన చివరి ఎంఆర్‌ఆర్ భేటీ సోమవారం షార్‌లో డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన జరిగింది. శాస్తవ్రేత్తలు పాల్గొని ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంఛింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రాకెట్ ద్వారా 1235 కిలోల బరువుఉన్న రీసోర్స్ శాట్-2ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ఉపగ్రహం భూమి నుంచి నింగిలోకి ఎగిరిన అనంతరం 827 కిలోమీటర్ల దూరంలో సూర్యానువర్తమాన కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శాస్తవ్రేత్తలు పూర్తి చేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ బుధవారం ఉదయం 10.25గంటలకు నింగిలోకి ఎగరనుంది. ఇప్పటి వరకు మొత్తం 37 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరగ్గా, మొదటిది మినహా మిగిలినవన్నీ వరుసగా విజయవంతం అయ్యాయి. ఇది 38 ప్రయోగం కావడం విశేషం. ఇప్పటి వరకు పిఎస్‌ఎల్‌వి రాకెట్ల ద్వారా మొత్తం 121 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఇందులో 79 విదేశీ ఉపగ్రహాలు కాగా, 42 భారత్‌కు చెందినవి. ప్రయోగ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మంగళవారం షార్‌కు రానున్నారు.